ప్రపంచంలోనే అత్యంత ప్రఖ్యాతి గాంచిన దేవస్థానాలలో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఇక ఇక్కడికి ప్రతి సంవత్సరం ఎన్నో కోట్ల మంది తిరుమల వారిని దర్శించుకోవడానికి ప్రపంచం నలుమూలల నుండి వస్తూ ఉంటారు. ఈ దేవస్థానాన్ని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుండో భక్తులు వస్తూ ఉండడంతో వారందరికీ అద్భుతమైన వసతులు కల్పించడం కోసం ఎప్పటి నుండో ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి వారందరికీ ఉచిత భోజనాన్ని మరియు అనేక వసతులను కల్పిస్తూ వస్తుంది. ఇక 2019 వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వై సి పి పార్టీ అధికారం లోకి వచ్చింది.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానంలో మునపటిల భక్తులకు సేవలు అందడం లేదు అని , అనేక కొరతలు ఏర్పడ్డాయని ఎంతో మంది చెబుతూ వచ్చారు. దానితో తెలుగు దేశం పార్టీ నేతలు అలాగే తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మేము మళ్లీ అధికారం లోకి వస్తాం. వచ్చాక తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో ఇది వరకు ఉన్న సేవల కంటే అద్భుతమైన సేవలను భక్తులకు అందిస్తాం అని చెప్పుతూ వచ్చాడు.

ఇక మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం పై ప్రత్యేక దృష్టి పెడతాము అని , భక్తులకు అద్భుతమైన సేవలను అందిస్తాము అని చెప్పుకొచ్చాడు. అద్భుతమైన క్వాలిటీతో అన్నదాన కార్యక్రమం ఉంటుంది అని , నిత్యం దేవస్థాన పరిసర ప్రాంతాల్లో ఎప్పుడూ దైవభక్తి ఉట్టిపడేలా సంగీతం ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం చంద్రబాబు ఇక్కడ పూర్వ వైభవాన్ని తీసుకువచ్చే విధంగా పనులను చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రజలకు మంచి సౌకర్యాలను , వసతులను కల్పించడానికి చంద్రబాబు కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

ttd