తెలంగాణ రాష్ట్రంలో... కల్వకుంట్ల చంద్రశేఖర రావు... పరిస్థితి ఇప్పుడు దారుణంగా తయారైందని చెప్పవచ్చు. కెసిఆర్ కు కంటిమీద కునుకు లేకుండా... తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారు. కళ్ళు మూసి తెరిచేలోపు... గులాబీ పార్టీ ఎమ్మెల్యేలను... తీసుకువెళ్లి కండువా కప్పేస్తున్నారు రేవంత్ రెడ్డి. అసలు... కాంగ్రెస్ నేతలకు తెలియకుండా... కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకువచ్చారు రేవంత్ రెడ్డి.


అయితే ఇప్పటికే...  ఆరుగురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.  ఆరుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలో.... మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ఒకేసారి... కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారట. ఈ మేరకు.... సీఎం రేవంత్ రెడ్డి తో కూడా చర్చలు జరిగినట్లు వార్తలు వస్తున్నాయి.


హైదరాబాద్ మహానగరం పరిధిలో ఉన్న.. ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారట.  అందులో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే  లక్ష్మారెడ్డి, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరెడ్డి కృష్ణారావు, అరికపూడి గాంధీ , కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద రెడ్డి  కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యేందుకు రెడీ అయ్యారట.


ఇవాళ లేదా రేపు ఈ రెండు రోజుల్లో ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారట. ఈ మేరకు రేవంత్ రెడ్డి తో చర్చలు కూడా జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే గ్రూప్ పరీక్షలు అలాగే డీఎస్సీ  పరీక్షలు వాయిదా వేయాలని నిరుద్యోగులు... నిరసనలు తెలుపుతున్నారు. దింతో సీఎం రేవంత్ రెడ్డి పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో... ప్రస్తుత ఇష్యూను డైవర్టు చేసేందుకు ఈ చేరికలు అంశాన్ని రేవంత్ రెడ్డి తెరపైకి తీసుకు వచ్చినట్లు చెబుతున్నారు. కాగా, ఇప్పటికే గులాబీ పార్టీ నుంచి గెలిచిన పోచారం, తెల్లం వెంకట్రావ్, కాలే యాదయ్య, కడియం శ్రీహరి,జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ , దానం నాగేందర్, కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr