ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ చెప్పేవి అన్నీ అబద్ధాలే అంటూ సీఎం చంద్రబాబు ఫైర్ అయ్యారు. మీ మనోభావాలకు అనుగుణంగా పాలన చేస్తామని ప్రకటించారు. పెన్షన్ లను పెంచాం, మెగా డీ ఎస్ సీ ఇచ్చాం, ల్యాండ్ గ్రాబ్బింగ్ యాక్ట్ ను రద్దు చేశామని గుర్తు చేశారు చంద్రబాబు.


పెట్టుబడులు పెట్టే వాళ్ళు రాష్ట్రంలోని భూతం గురుంచి భయపడుతూ ఉన్నారని వివరించారు. ఆ భూతాన్ని నియంత్రించే భూత వైద్యులు ప్రజలే దాన్ని చూసుకుంటారని బాబు చెప్పడం జరిగింది. రోడ్లపై ఉన్న గొయ్యల్లో వైఎస్ఆర్సీపీ నేతలను పూడ్చాలి.... గొయ్యిల పాలు అయిన ఆంధ్రప్రదేశ్   రాష్ట్రాన్ని ఏం చేయాలో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. దార్లపూడి పోలవరం కెనాల్ దగ్గర ప్రజలతో సీఎం చంద్రబాబు ఇవి ఎక్కడ చేయడం జరిగింది.


 విశాఖ స్టీల్ ప్లాంట్ ను గతంలో వాజపేయి హయాంలో ప్రైవేటీకరణ చేస్తాన్నప్పుడు అడ్డుకున్నాం, ఈ సారీ కాపాడుతామన్నారు. విశాఖ ను దోచేసిన దొంగలను వదిలే ప్రసక్తే లేదని..ప్రజా సేవకులు గా వచ్చాం వచ్చే పర్యటన నుంచి నా పర్యటనలో గ్రీన్ కార్పెట్ కూడా వేయొద్దని హెచ్చరించారు చంద్రబాబు నాయుడు. కార్పెట్ వేస్తె వాళ్లపై చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.


 ఎన్నికల్లో గోదావరి జిల్లాల తర్వాత అత్యధిక ఓట్లు, మెజారిటీ వచ్చింది ఉత్తరాంధ్ర నుంచే అని గుర్తు చేసేవారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాక్షస పాలనను అంతమొందించి మమ్మల్ని గెలిపించారు, మిమ్మల్ని నిలబెట్టె బాధ్యత నాది...ఐదేళ్ల ముందు ఎలాంటి పనులు చేశామో అలానే ఉన్నాయన్నారు. సుజల స్రవంతి నీ పూర్తి చేసుకుని గోదావరి నీళ్లు తెచ్చుకుంటే ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుందన్నారుఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇకపై ఏపీని మరింత డెవలప్ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పారు బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి: