ఏపీలో కూటమి ప్రభుతం ఏర్పాటై నెలరోజులు విజయవంతంగా పురస్కరించుకుంది. ఈ నేపథ్యంలోనే చంద్ర బాబు సూపర్ సిక్స్ హామీల మీద దృష్టి పెట్టినట్టు కనబడుతోంది. అవును, ఏపీ ప్రజలు హామీల గురించి ఆలోచించేలోపే ఒక్కొక్క దానిని ఫుల్ ఫీల్ చేసుకుంటూ పోవాలని బాబు యోచిస్తున్నట్టుగా కనబడుతోంది. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినపుడు సామాజిక పెన్షన్లు 4000 రూపాయిలు పెంపు ప్రధానమైన అంశాన్ని నిజం చేసి చూపించారు. ఈ క్రమంలో 66 లక్షల మంది సామాజిక పెన్షన్ దారులకు అండగా నిలిచారు. ఇక ఇపుడు కొత్తగా విద్యా సంవత్సరం ప్రారంభం అయింది కాబట్టి తల్లికి వందనం కార్యక్రమాన్ని అమలు చేయడానికి బాబు సన్నద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలు తాజాగా రిలీజ్ చేశారు.

కాగా తల్లికి 15000 రూపాయలు ఇస్తామని చెప్పడం మీద వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు కనబడుతోంది. తల్లికి కాకుండా విద్యార్థులు ఎంత మంది ఆ తల్లికి ఉంటే వారందరికీ పధకం వర్తింపచేయాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఈ పధకం అయితే ఎలాగైనా టీడీపీ పూర్తి వివరాలతో జీవో ఇష్యూ చేసి దసరా కంటే ముందుగానే తల్లుల ఖాతాలో వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇక సీఎంగా చంద్రబాబు పెట్టిన మరో సంతకం ఏపీలో అన్నా క్యాంటీన్లు ప్రారంభం. దానికి ఆగస్టు 15వ తేదీని ముహూర్తంగా పెట్టుకున్నారు. ఏపీ వ్యాప్తంగా 200కి పైగా క్యాంటీన్లని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీని మీద ఈ నెల 16న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారు అని అంటున్నారు.

అయితే ఇలాంటి వ్యవహారాలలో వైసీపీ జోక్యాన్ని టీడీపీ అస్సలు పట్టించుకోకుండా సూపర్ సిక్స్ పధకాల అమలు ధ్యేయంగా ముందుకు అడుగులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కూడా నెరవేర్చాలని బాబు సర్కార్ యోచిస్తోంది. ఇదిలా ఉంటే రైతన్నలకు రైతు భరోసా మొత్తాన్ని ఇరవై వేలకు పెంచుతామని టీడీపీ హామీ ఇచ్చిన సంగతి విదితమే. దీనిని కూడా వీలైనంత త్వరగా అమలు చేయాలని అనుకుంటోంది. ఎందుకంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ అయింది. రైతులు వ్యవసాయ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. అదేవిధంగా 18 ఏళ్ళు నిండిన ప్రతీ మహిళకు నెలకు 1500 రూపాయలు అన్న దాని మీద పూర్తి అధ్యయనం చేసి ఆ మీదట ఆ పధకాన్ని అమలు చేస్తారు అని విశ్వనీయ వర్గాల సమాచారం. ఇలా మొత్తం తొలి ఏడాదిలోనే హామీలు అన్నీ నెరవేరేలా ప్రణాళికలు రచిస్తోంది బాబు సర్కార్.

మరింత సమాచారం తెలుసుకోండి: