ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో.. ఇటీవల కొత్త ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత... కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత... తనదైన మార్క్ పాలనను చూపిస్తున్నారు. ఏపీ ప్రజలకు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా అడుగులు వేస్తున్నారు చంద్రబాబు నాయుడు. ముఖ్యంగా తన కేబినెట్లో ఉన్న మంత్రులకు ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నారు.


గతంలో జగన్మోహన్ రెడ్డి లాగా కాకుండా....  మిత్రులందరికీ వారి వారి శాఖలు అప్పగించి... ప్రభుత్వంలో దూకుడు పెంచుతున్నారు. ఏపీ ప్రజలకు న్యాయం జరిగేలా మంత్రులను పని చేయిస్తున్నారు. ఇందులో భాగంగా... పౌరసరఫరాల శాఖ మంత్రిగా  నాదెండ్ల మనోహర్ అద్భుతంగా పనిచేస్తున్నారు. అటు నారా లోకేష్ తన పని.. ఇప్పటికే మొదలుపెట్టారు. పవన్ కళ్యాణ్ కూడా తన మార్క్ చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి నారాయణ కూడా.. రంగంలోకి దిగి తన పని ప్రారంభించారు.


ముఖ్యంగా పిడుగురాళ్ల లో డయేరియా పై మంత్రి నారాయణ ఫోకస్‌ చేశారు. నిత్యం రివ్యూ చేస్తున్నారు. ఇక ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు కూడా చేశారు నారాయణ. పిడుగురాళ్ల లోని లెనిన్ నగర్,మారుతి నగర్ లో ఇప్పటి వరకూ 60 డయేరియా కేసులు నమోదయ్యాయని నారాయణ తెలిపారు. ప్రస్తుతం 39 మంది వివిధ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారన్నారు. చికిత్స పొందుతున్న వారి ఆరోగ్యం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. కృష్ణా నది నుంచి మంచి నీరు అందించేందుకు 16 కి.మీ పైప్ లైన్ ఉందని... దీంతో పాటు పట్టణంలో 7 పవర్ బోర్స్, 36 హాండ్ బోర్స్ ఉన్నాయని వెల్లడించారు.

ఒక పవర్ బోర్ లో నైట్రేట్ ఉన్నట్లు పరీక్షల్లో గుర్తించారని... కృష్ణా వాటర్ పైప్ లైన్ లీకేజి ఉండటంతో ఐదు రోజులు పాటు నీటి సరఫరా నిలిపి వేశారని తెలిపారు. ఈ ఐదు రోజుల్లో బోరు నీటిని వాడారని.... కృష్ణా పైప్ లైన్ ద్వారా ప్రస్తుతం తాగు నీరు ఇస్తున్నప్పటికీ ఇంకా కేసులు వస్తున్నాయని పేర్కొన్నారు. నీటిని పరీక్ష కోసం విజయవాడ ల్యాబ్ కు ఈరోజు శాంపిల్స్ పంపిస్తున్నామని... కొన్ని రిపోర్ట్ లు వస్తాయి...మరికొన్ని రిపోర్ట్ లు  48 గంటల్లో వస్తాయన్నారు. లెనిన్ నగర్,మారుతి నగర్ ప్రజలు నీళ్ళు కాచి తాగాలి..పట్టణంలో ఉన్న R0 ప్లాంట్స్ అన్నీ  కూడా టెస్ట్ చేయాల్సి ఉందని వెల్లడించారు. ఇలా ప్రజల కోసం పని చేస్తూ.. ముందుకు వెళుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ap