ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఇప్పటికే పెంచిన పెన్షన్, మెగా డీఎస్సీ ఉచిత ఇసుక వంటి హామీలను కూడా అమలు చేసిన ఏపీ ప్రభుత్వం ఇప్పుడు మరొక కీలకమైన హామీని సైతం అమలు చేసేందుకు సిద్ధమయ్యింది.. ఇప్పుడు మహాలక్ష్మి పథకాన్ని కూడా అమలు చేసే విధంగా అడుగులు వేస్తున్నారు.. ఈ పథకాని కింద ఉచితంగా మహిళలకు బస్సు ప్రయాణాన్ని అమలు చేసేందుకు సిద్ధమయ్యారు ఏపీ సర్కార్.


ఆగస్టు 15న విశాఖలో ఈ పథకాన్ని ప్రారంభించడానికి సీఎం చంద్రబాబు పలు రకాల నిర్ణయాలు తీసుకున్నట్లు తెలుస్తోంది.. అలాగే అదే రోజున అన్న క్యాంటీన్లు కూడా ప్రారంభించాలని అందుకు సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసినట్లు తెలుస్తోంది ఏపీ సర్కార్.. జులై 16న జరిగే మంత్రివర్గ సమావేశంలో ఈ ఉచిత బస్సు పథకాన్ని కూడా అమలు చేసే విధంగా ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుందట.. ముఖ్యంగా మహిళలు ఏ క్యాటగిరి బస్సులలో ఈ అవకాశం కల్పించాలని విషయం పైన అధికారులతో మాట్లాడి కసరత్తులు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


ప్రస్తుతం ఉన్న బస్సులతో ఈ పథకం అమలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయని అధికారులు ఇప్పటికే చాలా స్పష్టంగా ఉన్నట్లు తెలుస్తోంది కొత్త బస్సులు తీసుకువచ్చే వరకు ఈ పథకం వాయిదా వేయాలంటూ అధికారులు ఏపీ సర్కార్కు సైతం వినతి చేసుకున్నట్లు సమాచారం.. మరి ప్రభుత్వం మాత్రం ఈ పథకం అమలు వైపే ఎక్కువగా మక్కువ చూపుతున్నట్లు తెలుస్తోంది.. మరి అనుకున్న సమయానికి ఉచిత బస్సు పథకం అమలులోకి వస్తుందా రాదా అనే విషయం తెలియాలి అంటే ఆగస్టు 15 వరకు ఆగాల్సిందే.. ఏది ఏమైనా ఆగస్టు 15వ తేదీన మాత్రం మహిళలకు శుభవార్త ఉంటుందనే విషయాన్ని టిడిపి నేతలు కార్యకర్తలు తెలియజేస్తున్నారు. మరి ఏపీ సీఎం ఎలా చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: