తిరుమల  తిరుపతి  దేవస్థానం ఎంతో ప్రాముఖ్యత చెందిన సంగతి మన అందరికీ తెలిసిందే. అలాంటి శ్రీవారి సన్నిధికి...  ప్రతిరోజు వేల నుంచి లక్ష వరకు... భక్తులు వస్తూనే ఉంటారు. అలాంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో... రోజుకో ప్రమాదం జరుగుతోంది. రోడ్డు ప్రమాదాలు, కొండ చరియలు విరిగిపడటం జరుగుతోంది. అయితే.. తాజాగా ఓ మహిళ భక్తురాలికి తీవ్ర గాయాలు అయ్యాయి. తిరుమలలో దేవుడి దర్శనానికి వెళ్లినటువంటి యువతి గాయాల పాలయ్యింది.

తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలోని ఆంజనేయ స్వామి దర్శనానికి వెళుతున్న యువతిపైన ఒక్కసారిగా చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆ యువతిని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లారు. తల, వెన్నెముకకు తీవ్రంగా గాయాలయ్యాయని వైద్యులు తెలియజేశారు. బాధితురాలు వివరాలు తెలియాల్సి ఉంది. సీసీ కెమెరాలు రికార్డ్ అయిన ఈ వీడియో సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది.  


అయితే.. ఈ సంఘటన బుధవారం జరిగిందా, నిన్న జరిగిందా అనేది తెలియరాలేదు. కానీ ఇవాళ ఉదయం నుంచి ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌ గా మారింది.  అటు, తిరుపతిలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని బిఎన్ కండ్రిగ మండలం పార్లపల్లి వద్ద కారు, ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఒడిశాకు చెందిన బపూన్ ఖాన్ (22), సుక్ దేవ్ సింగ్ (21), రాజా సింగ్ (23) మృతి చెందారు. వీరు స్థానికంగా ఉన్న అట్టల పరిశ్రమలో పనిచేస్తున్నారు.


గురువారం రోజున బైక్ పైన వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఇలాంటి సంఘటనలు చాలా కామన్‌ అని.. రోజుకోకటి జరుగుతాయని అక్కడి అధికారులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: