ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ అధినేత రాజకీయ జీవితం ఎలా ఉంటుందో చెప్పలేము కానీ.. అద్భుతంగా ఉంటుందని చెప్పలేము అలా అని నాశనం అయిపోతుందని కూడా చెప్పలేము.. ఎందుకంటే రాజకీయం అనేటువంటిది స్థిరత్వం లేనటువంటిది.. ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. గతంలో అద్భుతమైన ఫలితాలు అందుకున్న టిడిపి 2019లో చాలా ఘోరంగా దెబ్బతింది. 2024 లో మళ్ళీ అద్భుతంగానే పుంజుకుంది. అలాగే అద్భుతం అనుకున్నటువంటి స్టేజిలోకి వెళ్లిపోయిన వైసీపీ లాస్ట్ కి ఘోరమైన పరిస్థితి ఏర్పడింది. చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయ్యింది.


అందుకే భవిష్యత్తు మాత్రం ఎలా ఉంటుందో చెప్పలేము కానీ ఒక రికార్డును మాత్రం జగన్మోహన్ రెడ్డి సొంతమని చెప్పవచ్చు.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పార్టీ పెట్టిన తర్వాత.. సొంతగా అధికారంలోకి వచ్చిన వారిలో మొట్టమొదట ఎన్టీ రామారావు.. ఆ తర్వాతే జగన్మోహన్ రెడ్డి వచ్చారు. ఎన్టీ రామారావు గారు కూడా 1983లో పార్టీ మొదలుపెట్టిన ఆ తర్వాత నెమ్మదిగా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా గెలిచారట. ఇక అదే విషయంలో జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పటివరకు పొత్తు అనేది పెట్టుకోలేదు.


మరొకరి విషయం ఏమిటంటే ఆంధ్రాలో పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయిన మొట్టమొదట ఎన్టీ రామారావు ఆ తర్వాత మళ్లీ జగన్మోహన్ రెడ్డి ఆస్థానాన్ని అందుకున్నారు.. మధ్యలో పార్టీ పెట్టినవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో నాదెండ్ల మనోహర్, మర్రి చెన్నారెడ్డి పెట్టారు, ఎన్టీఆర్ టిడిపి అని లక్ష్మీపార్వతి పెట్టి ఫెయిల్ అయింది, అన్న టిడిపి అని పార్టీ పెట్టి హరికృష్ణ కూడా ఫెయిల్ అయ్యారు. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి పెట్టి, లోక్సత్తా జయప్రకాశ్ నారాయణ, నవతెలంగాణ దేవేంద్ర గౌడ్, జై తెలంగాణ విజయశాంతి, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన డిప్యూటీ సీఎం గా ఉంటున్నారు నెక్స్ట్ సీఎం గా ప్లాన్ చేసుకుంటున్నారు. ఫస్ట్ పార్టీ పెట్టిన తర్వాత సీఎం అయిన రికార్డు సీనియర్ ఎన్టీఆర్కి ఉండగా ఆ తర్వాత రికార్డు జగన్కే ఉన్నది.. సింగల్ గానే సీఎం అయినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి.

మరింత సమాచారం తెలుసుకోండి: