ప్రస్తుతం ఇండియాలో ఎక్కడ చూసిన కూడా ఒకే విషయం గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు  అదే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ పెళ్లి వేడుక గురించి. ఆనంద్ అంబానికి రాధిక మర్చంట్ కి ఇటీవల పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేడుకకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ సెలబ్రిటీలందరూ కూడా హాజరవుతున్నారు. ఇక ఇండియాలోనే సినీ రాజకీయ క్రీడారంగ ప్రముఖులందరూ కూడా విచ్చేస్తున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఏకంగా అంబరాన్నాంటెల  ఈ పెళ్లి వేడుక ఎంతో ఘనంగా జరుగుతుంది. దీంతో ఇక వార్తల్లో ఈ అంబానీ ఇంటి పెళ్లి వేడుక కాస్త హాట్ టాపిక్ గా మారిపోయింది   అదే సమయంలో ఇక ఇప్పుడు అంబానీ ఇంటికి కోడలుగా రాబోతున్న రాధిక మార్చంట్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అంబానీ కుటుంబం ఆమెను ఎందుకు కోడలుగా చేసుకునేందుకు ఒప్పుకుంది అనే విషయం కూడా తెలుసుకోవడానికి అందరూ సోషల్ మీడియాలో వెతికేస్తున్నారు? అయితే ఇలా అంబానీ ఇంటికి కోడలుగా రాబోతున్న రాధిక మర్చంట్ కు అక్క అంజలి మర్చంట్ కూడా ఉంది. దీంతో ఆమె గురించి తెలుసుకునేందుకు కూడా అందరూ ఆసక్తిని కనబరుస్తున్నారు అని చెప్పాలి.


 ప్రస్తుతం వ్యాపార సామ్రాజ్యంలో రాధిక మర్చంట్ సోదరి అంజలి మర్చంట్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారట  ఫాదర్ వినేస్ మర్చంట్ ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో గ్లోబల్ కాంట్రాక్ట్ కంపెనీ అయినా ఎన్ కోర్ హెల్త్ కేర్ వ్యవస్థాపకుడు. అయితే రాధిక అంజలి ఇద్దరు కూడా ఈ కంపెనీలో డైరెక్టర్లు బోర్డులో ఉన్నారు. తండ్రి విజయంలో ఇద్దరు కీలక పాత్ర పోషించారు. కాగా రాధిక సోదరి మొదట్లో జనరల్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్ అండ్ కస్టమర్ ఔట్రీచ్ మేనేజర్ గా కూడా పనిచేశారట. ఇక తర్వాత మైలున్ మెటల్స్ ని స్థాపించారట అంజలి. అలియా భట్, టబూ సహా మరి కొంతమంది ప్రముఖులు ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారట. కాగా అంజలి తన విద్యాభ్యాసం కానన్ స్కూల్ మరియు ఎకో మొండియేల్ వరల్డ్ స్కూల్ లో పూర్తి చేయగా.. ఇక తర్వాత విదేశాల్లో చదువుకున్నారట.  2020లో ప్రముఖ వ్యాపారవేత్త అమన్ మజీయాను అంజలి వివాహం చేసుకున్నారు  వీరికి ఒక కొడుకు ఉన్నాడు. ఇక అంజలి నికర విలువ రూ . రెండు వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా. విరెన్ మర్చంట్ కుటుంబం ఫార్మాసియుటికల్ పరిశ్రమలో అగ్రవగామిగా కొనసాగుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: