ఏపీ విద్యుత్ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మంత్రిగా బాధ్యతలు తీసుకున్న కొన్ని రోజుల్లోనే ఆయన తన మార్క్ నిర్ణయాలతో ముందడుగులు వేస్తున్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే రాష్ట్రంలో కొత్తగా 40,336 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేస్తూ గొట్టిపాటి రవికుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఈ విద్యుత్ కనెక్షన్ల మంజూరు ఎంతోమంది రైతుల జీవితాలను మార్చేసిందనే చెప్పాలి.
 
ప్రభుత్వ కార్యాలయాలకు దశల వారీగా సోలార్ విద్యుత్ కనెక్షన్ల మంజూరు దస్త్రంపై గొట్టిపాటి రవికుమార్ రెండో సంతకం చేశారు. పీఎం సూర్యఘర్ స్కీమ్ లో భాగంగా ఇంటింటికీ 3 కిలోవాట్ల సోలార్ విద్యుత్ అందించే దస్త్రంపై ఆయన మూడో సంతకం చేశారు. దేశంలోనే అత్యుత్తమ విద్యుత్ శాఖగా ఏపీ విద్యుత్ శాఖను తీర్చిదిద్దుత్తామని ఆయన వెల్లడించారు.
 
ఏపీ వాసులు కరెంట్ కు సంబంధించి ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా ఏపీ ఎస్పీడీసీఎల్ వెబ్ సైట్ లో ఉన్న టోల్ ఫ్రీ నంబర్ల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవచ్చు. ఉమ్మడి కడప జిల్లాకు చెందిన రైతు గంగయ్య పొలంలో విద్యుత్ తీగలు నేలకు తాకడం వల్ల ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ సమస్య తన దృష్టికి వచ్చిన వెంటనే మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈ సమస్యను పరిష్కరించారు.
 
వర్షాకాలంలో రైతన్నలకు ఇబ్బందులు కలగకుండా గొట్టిపాటి రవికుమార్ అధికారులకు కీలక సూచనలు చేయడం జరిగింది. పూడికలు తీయక అస్తవ్యస్తంగా ఉన్న పంటకాలువలను వీలైనంత త్వరగా గుర్తించి సరి చేయాలని ఆయన పేర్కొన్నారు. గొట్టిపాటి రవికుమార్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రాబోయే రోజుల్లో ట్రూ అప్ ఛార్జీలు లేకుండా కరెంటు బిల్లులు మంజూరు కానున్నాయని తెలుస్తోంది. ప్రజలపై భారం పడకుండా టీడీపీ సర్కార్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చంద్రబాబు ఇచ్చిన మంత్రి పదవికి గొట్టిపాటి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారనే చెప్పాలి.
 
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: