గడిచిన ఐదేళ్ల వైసీపీ పాలనలో సినిమా టికెట్ రేట్లకు సంబంధించి ఏ స్థాయిలో రాజకీయాలు జరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వైసీపీకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల సినిమాలకు టికెట్ రేట్ల పెంపు అమలు కాగా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న హీరోల సినిమాలకు ఏ స్థాయిలో ఇబ్బందులు ఎదురయ్యాయో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ నటించిన సినిమాల టికెట్లు 20 రూపాయలు, 10 రూపాయలకు సైతం కొన్ని ప్రాంతాఅలో అమ్ముడయ్యాయి.
అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సినిమాల బడ్జెట్ కు అనుగుణంగా టికెట్ రేట్లను పెంచుతూ నిర్మాతల కళ్లలో ఆనందం నింపడంతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వడం ద్వారా ప్రేక్షకులకు సంతోషాన్ని కలిగించారు. ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి రావడం వల్లే కల్కి సినిమా అలవోకగా 1000 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించిందని చెప్పవచ్చు.
ఏపీలో సినిమా థియేటర్లకు పూర్వ వైభవం రావడంలో టీడీపీ సర్కార్ కీలక పాత్ర పోషిస్తుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పర్యాటక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి అయిన కందుల దుర్గేష్ రాబోయే రోజుల్లో కోనసీమను అద్భుతంగా అభివృద్ధి చేస్తామని చెప్పుకొచ్చారు. సినిమా షూటింగ్ లు పెరిగేలా చర్యలు తీసుకుంటామని కందుల దుర్గేష్ కామెంట్లు చేశారు. రాష్ట్రంలో స్టూడియోల నిర్మాణం కోసం ముందుకు రావాలని ఆయన నిర్మాతలకు ఆహ్వానం తెలిపారు.
రాబోయే రోజులలో పర్యాటక రంగానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని కందుల దుర్గేష్ వెల్లడించారు. జనసేన నేతకు మంత్రి పదవి ఇవ్వడంపై ఇండస్ట్రీ వర్గాల నుంచి ప్రశంసలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కల్కి 2898 ఏడీ సక్సెస్ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో పాన్ ఇండియా సినిమాలకు క్రేజ్ మరింత పెరుగుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఏపీలో సినిమా రంగానికి త్వరలో పూర్వ వైభవం రావడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.