
- ఎన్నో స్వచ్ఛంద సంస్థల ద్వారా పేద ప్రజలకు సేవలు..
- రామచంద్రపురం రారాజు వాసంశెట్టి సుభాష్..
కొంతమందికి అదృష్టం వెతుక్కుంటూ తలుపు తడుతుంది. దాన్ని అక్కున చేర్చుకొని కాపాడుకుంటేనే ముందుకు వెళ్లగలుగుతాం. అలాంటి అదృష్టానికి బ్రాండ్ అంబాసిడర్ వాసంశెట్టి సుభాష్. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి కూడా కొట్టేశారు. అలాంటి సుభాష్ రాజకీయ నేపథ్యం ఏంటి..ఆయన ఎక్కడ పుట్టారు, ఎలాంటి పనులు చేశారు అనే వివరాలు చూద్దాం. రామచంద్రాపురం శాసనసభ్యుడిగా ఘన విజయం సాధించినటువంటి వాసంశెట్టి శుభాష్ శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. ముందు వైసీపీ పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వాసంశెట్టి సుభాష్ సరిగ్గా ఎన్నికలకు మూడు నెలల ముందే టిడిపి పార్టీలో చేరారు. అలాంటి ఈయనకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉండటంతో రామచంద్రపురం టికెట్ ఆయనకే కేటాయించారు చంద్రబాబు. మొదటి ఎన్నికల్లోనే అద్భుతమైన మెజారిటీతో గెలిచినటువంటి వాసంశెట్టికి మంత్రి పదవి అందించారు. అలాంటి వాసంశెట్టి రాజకీయ జీవితం విషయానికి వస్తే..సుభాష్ తాతయ్య సుబ్బన్న వ్యాపారంగంలో అగ్రగన్యుడు.