ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ తనకు ఇచ్చిన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తూ మంత్రులలో తనకంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఏపీ కీర్తి ప్రతిష్టలు పెంచే విధంగా పయ్యావుల కేశవ్ నిర్ణయాలు ఉన్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మంత్రి పయ్యావుల కేశవ్ పాలనలో తన మార్క్ తో అదరగొడుతున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఆర్థిక శాఖతో పాటు శాసనసభ వ్యవహారాలను పయ్యావుల కేశవ్ చూసుకుంటారు. గురువారం రోజున మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పయ్యావుల కేశవ్ స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై తొలి సంతకం చేశారు. స్థానిక సంస్థలకు ఆయన 250 కోట్ల రూపాయల మేర నిధులను విడుదల చేయడం జరిగింది. ఎన్నికల హామీల్లో భాగంగా చంద్రబాబు నాయుడు స్థానిక సంస్థకు నిధులు ఇస్తానని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
 
పయ్యావుల కేశవ్ వైసీపీకి గౌరవం ఇవ్వాల్సిన సమయంలో ఇస్తూనే విమర్శించాల్సిన సమయంలో విమర్శిస్తూ జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంపై భారం పెరగకుండా అదే సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కచ్చితంగా చెప్పిన విధంగా నెరవేర్చేలా పయ్యావుల కేశవ్ ప్రణాళికలు ఉన్నాయి. ఏపీకి 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయని ప్రాథమికంగా తెలుస్తోంది.
 
పెండింగ్ బిల్లులపై కూడా చంద్రబాబు, పయ్యావుల కేశవ్ ప్రత్యేక దృష్టి పెట్టనున్నారని సమాచారం అందుతోంది. రాష్ట్రానికి వస్తున్న ఆదాయం, పెండింగ్ బిల్లులపై పయ్యావుల కేశవ్ ప్రత్యేక దృష్టి పెట్టారని తెలుస్తోంది. పయ్యావుల కేశవ్ తనకు ఇచ్చిన పదవికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రాష్ట్రంలో టీడీపీ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పయ్యవుల కేశవ్ మంత్రిగా రాష్ట్రానికి మెరుగైన పాలన అందించడానికి తన వంతు కృషి చేస్తున్నారు. పయ్యావులకు మంత్రి పదవి దక్కడంతో ఉమ్మడి అనంతపూర్ వాసులు సైతం ఎంతో సంతోషిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: