నంద్యాల జిల్లా ముచ్చుమర్రి గ్రామంలో ఈ దారుణం చోటు చేసుకున్నది.. ఈ అంశం పైన పెద్ద ఎత్తున ఏపీలో దుమారం వినిపిస్తోంది. మచ్చుమర్రి గ్రామానికి చెందినటువంటి సుజాత, మద్దిలేటి దంపతులకు ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు.. వీరు కూలి పనులకు వెళ్లి తమ జీవనోపాధిని గడుపుకునేవారు. రెండవ కుమార్తె వాసంతి మూడవ తరగతి చదువుతోంది.. గడిచిన ఆదివారం సెలవు కావడం చేత ఇంటి దగ్గర ఉన్న పార్కులో ఆడుకుంటూ ఉండగా.. మధ్యాహ్నం దాటిన ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్కు వెళ్లి మరి ఫిర్యాదు చేశారు.
అయితే అనుమానం వచ్చిన ముగ్గురు మైనర్ బాలురను తమదైన స్టైల్ లో పోలీసులు విచారించి సంచలన విషయాలను వెలుగులోకి తీసుకువచ్చారు. దీంతో వారు వాసంతి పైన అత్యాచారం చేసి ఒకసారి కాలవలో పడేసామని అంగీకరించగా మరొకసారి పూడ్చి పెట్టామని అంగీకరించారు. ఈ ఘటన అందరిని కలిసి వేయడంతో ముగ్గురు కూడా 15 ఏళ్లలోపు ఉన్నవారు.. తాజాగా యాంకర్ రష్మీ వీటిపైన స్పందిస్తూ వాళ్ళు పెద్ద వాళ్ళ హత్యాచారం చేయగలిగారు కాబట్టి వారు పెద్దవాళ్లే.. శిక్ష వేయకుండా ఉండకూడదు.. వారికి ఏమాత్రం పశ్చాతాపం కూడా పడలేదు.. కాబట్టి ఖచ్చితంగా మైనర్లు అయితే కాదు మైనర్లు అనే నేపంతో వాళ్లకు తక్కువ శిక్ష వేయడం కరెక్ట్ కాదు అంటూ రష్మి ఒక ట్విట్ ని షేర్ చేసింది. ఈ పోస్టుకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు CEO ను ట్యాగ్ చేయడం జరిగింది.