ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటున్నారు. రాష్ట్రంలో పేదరికం నిర్మూలన దిశగా చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పథకాలపై ప్రశంసల వర్షం కురుస్తోంది. పేద కుటుంబానికి రూ.1,80,000 మంజూరు చేసిన చంద్రబాబును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. నిరుపేద కుటుంబానికి ఇచ్చిన హామీని బాబు నిలబెట్టుకున్నారు.
 
ఈ నెల 1వ తేదీన చంద్రబాబు నాయుడు పెనుమూకలోని పాముల నాయక్ ఇంటికి వెళ్లి పింఛన్ పంపిణీ చేశారు. ఆ సమయంలో పూరిగుడిసెలో ఉన్న పాముల నాయక్ కుటుంబాన్ని చూసి బాబు చలించిపోయారు. ఇల్లు కట్టుకోవడానికి సహాయం చేయాలని ఆ కుటుంబం చంద్రబాబును కోరగా సహాయం చేస్తానని మాట ఇచ్చిన చంద్రబాబు ఆ మాటను నిలబెట్టుకోవడం ద్వారా వార్తల్లో నిలిచారు.
 
పాముల నాయక్ ఫ్యామిలీకి ఇల్లు మంజూరు చేయాలని చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఇంటి నిర్మాణం కొరకు ఏపీ ప్రభుత్వం ఏకంగా 1,80,000 రూపాయలు మంజూరు చేయడం గమనార్హం. ఈ విషయం తెలిసిన నెటిజన్లు చంద్రబాబు నాయుడు గ్రేట్ అని బాబు పాలన సూపర్ అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భూమిపూజ కార్యక్రమాలు సైతం మొదలుకావడం కొసమెరుపు.
 
తెలుగుదేశం పార్టీ నాయకులు పాముల నాయక్ ఇంటి నిర్మాణ పనుల కోసం తమ వంతు సహాయసహకారాలు అందిస్తున్నారని భోగట్టా. కూటమి వచ్చిన నెలరోజుల్లోనే జనరంజక పాలన దిశగా అడుగులు పడటంతో పాటు తమకు మేలు జరగడంపై పాముల నాయక్ దంపతులు సంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చంద్రబాబు, లోకేశ్ మరింత మంది పేదలకు సహాయం చేయాలని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమంలకు సమపాళ్లలో ప్రాధాన్యత ఇస్తున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం కొసమెరుపు. చంద్రబాబు నాయుడు  సీఎంగా ప్రశంసలు అందుకుంటూ ఒక్కో మెట్టు ఎదుగుతుండటం గమనార్హం.




 


మరింత సమాచారం తెలుసుకోండి: