అయితే ఇపుడు ఇలాంటి అంశాలే రాజకీయం అవుతున్నాయి. వామ పక్షాలు వంటివి ఆరెస్సెస్ గురించి మాట్లాడుతూ కొన్ని విమర్శలు చేస్తూ ఉంటారు. ఇక విపక్షాలు సంగతి సరేసరి. అవి ఎలాగూ బీజేపీకి వ్యతిరేకం కాబట్టి హిందుత్వంతో ముడిపెట్టి రాజకీయం చేస్తూ బడుగు బలహీన వర్గాల ఓట్లను కొల్లగొట్టాలని కలలు కంటూ ఉంటాయి. ఇక విజయవాడలో తాజాగా జరిగిన సీపీఎం విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ నేతలు మాట్లాడుతూ 2025 నాటికి ఈ దేశాన్ని హిందూ దేశంగా మార్చాలన్నదే బీజేపీ అజెండా అని ఆరోపించారు. సీపీఎం పొలిట్ బ్యూరో మెంబర్ ఎం ఏ బేబీ మాట్లాడుతూ హిందూ దేశం అన్న ఆలోచనలు ఆరెస్సెస్ లో ఉన్నాయని వాటిని సాకారం చేసే పనిలో బీజేపీ ఉందని ఆరోపణలు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఇక్కడ మనం బీజేపీ - ఆరెస్సెస్ మధ్య ఉన్న సంబంధం గురించి మాట్లాడుకోవాలి. బీజేపీ ఏదన్నా సందర్భం వచ్చినపుడు సనాతన ధర్మం గురించి మాట్లాడుతుంది తప్ప.. హిందూ మతం అన్న ఏర్పాటు మాటలు ఎప్పుడూ ఆడదు. అయితే బేసిగా ఈ భరత భూమి హిందూ ధర్మానికి సంబందించిన నేల కాబట్టి ఇతర మత పరమైన మార్పిడులను ఖండిస్తారు. ఇక ఆరెస్సెస్ కూడా అంతే... భారతీయ సనాతన సంప్రదాయాలను ప్రోత్సహిస్తాయే తప్పితే ఇతర మతాల వారిని మా మతంలో చేరండి అని ఏనాడూ చెప్పిన దాఖలాలు కనబడవు... ఇదే బీజేపీ - ఆరెస్సెస్ మధ్యన గల అవినాభావ సంబంధం. ఇది అర్ధం అయిన వారికి ధర్మం అర్ధం వుంటుంది. అర్ధం చేసుకోలేని కుంచిత స్వభావులకు అస్సలు ఏమీ అర్ధం కాదు!