ఏపీలో గడిచిన 5 సంవత్సరాలు జగన్ పాలనలో జరిగిన దారుణాలు, అక్రమాలు తవ్వేకొద్దీ బయట పడుతున్నాయి అని ఏపీ రాజకీయాల్లో ఇపుడు బలంగా వినబడుతున్న మాటలు. ఇక వాటికి బలం చేకూరుస్తూ రోజుకో సరికొత్త యవ్వారం వెలుగులోకి రావడం బాధాకరం. ఈ నేపథ్యంలో తాజాగా జగన్ చివరి 6 నెలల్లో చేసిన ఒక దారుణమైన వ్యవహారం ఇపుడు బయటకు పొక్కింది. దాంతో ఈ వ్యవహారం ఇపుడు ఏపీలో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. అవును... గత 6 నెలల్లో వైసీపీ సర్కార్ హయాంలో ఏపీలో జరిగిన ఎసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్ అంశం ఇప్పుడు వెలుగులోకి వచ్చి వైసీపీ వర్గాన్ని ఇరకాటంలో పెట్టింది.

ఇందులో భాగంగా గడిచిన 6 నెలల్లో సుమారు 49,398.07 ఎకరాల ఎసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో... పేదలకు కేటాయించిన ఈ ఎసైన్డ్ భూములను వైసీపీ నేతలు, పలువురు అధికారులు అడ్డగోలుగా కొట్టేశారని అంటున్నారు. ఎసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కుల కల్పనపై నాటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందుగానే పేదల నుంచి ఆ పార్టీ నేతలు, సీనియర్ అధికారులు, ముందస్తు ఒప్పందాలు చేసుకునొన్నారని, ఈ క్రమంలోనే పేదల భూములు చౌక ధరకు కొనుగోలు చేసి కొట్టేశారని సమాచారం. ఇదే సమయంలో యాజమాన్య హక్కుల కల్పన నిర్ణయం అనంతరం... నిషిద్ద జాబితా 22(ఏ) నుంచి రాష్ట్రవ్యాప్తంగా 9,00,975.23 ఎకరాలను తొలగించారని చెబుతున్నారు. ఇలా కొంతమంది వైసీపీ పెద్దలు తమ పలుకుబడిని ఉపయోగించి తమ పేరిట, బినామీల పేరిట రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని అంటున్నారు.

ఈ సమయంలో జీవో నెంబర్ 596 అమలును ప్రస్తుత కూటమి ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపి వేసింది. వైసీపీ ప్రభుత్వంలో రిజిస్ట్రేషన్ శాఖ ఐజీగా ఉన్న రామకృష్ణ తాజాగా ప్రభుత్వానికి ఈ వివరాలు పంపించడం కొసమెరుపు. ఇదే క్రమంలో... ఎసైన్డ్‌ భూములను తక్కువ ధరలకు కొనుగోలు చేయదంపై ఇటీవల వరకూ సీఎస్ గా ఉన్న జవహార్ రెడ్డిపై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి అందరికీ తెలిసిందే! కాగా... గత ఏడాది జూలై 31 నాటికంటే ఇరవై ఏళ్ల ముందు ఎసైన్‌ చేసిన అగ్రికల్చర్ ల్యాండ్స్ ను అమ్ముకునే వెసులుబాటు కల్పిస్తూ గత ఏడాది అక్టోబర్ 27న వైసీపీ ప్రభుత్వం గెజిట్ జారీ చేయడం జరిగింది. దీనికి అనుగుణంగానే జీవో 596 విడుదల కావడం గమనార్హం. ఇదే సమయంలో... ఈ భూముల రిజిస్ట్రేషన్లు వేగంగా జరిగేందుకు వీలుగా రిజిస్ట్రేషన్ శాఖ ఐజీ రామకృష్ణ ఈ ఏడాది జనవరిలో మూడు మెమోలు కూడా జారీచేశారు. ఇక త్వరలో ఈ మొత్తం వ్యవహారం పైన ఓ కమిటీ వేసి నిందితులను పట్టుకోనున్నారని భోగట్టా!

మరింత సమాచారం తెలుసుకోండి: