డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు.. కందుల దుర్గేష్ ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు. ఈసారి టీడీపీ నుంచి ఎక్కువ సంఖ్యలో కాపుల ఎమ్మెల్యేలు గెలిచారు. ఉత్తరంధ్ర నుంచి చూస్తే.. ఓసి కాపులతో పాటు బీసీ కాపులు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నారు. తూర్పు కాపు కోటాలో విజయనగరం నుంచి గజపతినగరం ఎమ్మెల్యే కొండపల్లి శ్రీనివాస్ ఒక్కరికి మంత్రి పదవి దక్కింది. అది కూడా బీసీ కోటాలో కావటం విశేషం. గంటా శ్రీనివాసరావు లాంటి సీనియర్లకు కూడా ఈసారి మంత్రి పదవులు రాలేదు. అంతేకాదు గోదావరి జిల్లాలో చూసుకున్న అదే పరిస్థితి కనిపిస్తోంది.
గతంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు.. హోం శాఖను నిర్వహించిన నిమ్మకాయల చినరాజప్పకు ఈసారి మంత్రి పదవి రాలేదు. మంత్రి పదవి తన చిరకాల కోరికగా చెప్పుకున్న సీనియర్ నేత జ్యోతుల నెహ్రూ కూడా ఆ పదవి ఇవ్వలేదు. చంద్రబాబు ఏపీలో కమ్మ, బీసీ, కాపు తరహాలో కొత్త సోషల్ ఇంజనీరింగ్ ముందుకు తెచ్చారు. ఏది ఏమైనా కాపుల్లో కృష్ణా జిల్లా నుంచి మండలి బుద్ధప్రసాద్, గుంటూరు జిల్లా నుంచి కన్నా లక్ష్మీనారాయణ లాంటి సీనియర్లు ఉన్న అవకాశాలు రాలేదు. నిమ్మల రామానాయుడు, నెల్లూరు నుంచి నారాయణ లాంటి వాళ్లకు మాత్రమే అవకాశాలు వచ్చాయి. ఓవరాల్ గా టీడీపీ నుంచి కాపులు చాలామంది గెలిచినా కూడా వాళ్లకు మంత్రి పదవులు దక్కే ఛాన్సులు లేవన్నది అయితే కష్టంగానే కనిపిస్తోంది.