ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఒక్కొక్క నిర్ణయాలను తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పుడు తాజాగా ఏపీ ప్రభుత్వం జిపిఎస్ చట్టాన్ని అమలు చేస్తూ గెజిట్ విడుదల చేసినట్లు తెలుస్తోంది.. అయితే ఇది టిడిపి ప్రభుత్వం విడుదల చేసింది కాదు అని గత ప్రభుత్వం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే జిపిఎస్ విడుదల చేసింది అంటూ తెలిపారు.. ఈ జిపిఎస్ కు సంబంధించిన ఫైల్ పైన గత నెలలో 12వ తేదీన అప్పటి ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాని అయినటువంటి ఎస్ఎస్ రావత్ సంతకం చేసినట్లుగా తెలియజేశారు.


ఆయన సెలవులు పైన వెళుతూ ఉన్న సమయంలో పెండింగ్ ఫైల్స్ పైన సంతకాలు చేసినట్లు తెలియజేసింది ఏపీ ప్రభుత్వం ఈ ఫైల్స్ లోని జిపిఎస్ కు సంబంధించి ఫైల్ కూడా ఉందని తెలిపారు. జూన్ 12న జీవో 54 ను విడుదల చేయగా.. గత ప్రభుత్వంలో రూపొందించిన ఈ నోటిఫికేషన్ ని నిన్నటి రోజున గెజిట్లో అప్లోడ్ చేయడంతో ఉద్యోగుల్లో సైతం ఆందోళన మొదలయ్యింది.. అయితే ఈ గెజిట్ జిపిఎస్ గత ఏడాది అక్టోబర్ 20 నుంచి అమలులోకి వచ్చినట్లుగా తెలియజేయడం విశేషము..


అయితే జిపిఎస్ పై ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి గత ఏడాది అక్టోబర్ నుంచి అమలులో వస్తుందనడంతో ఒక్కసారిగా ఉద్యోగులకు షాక్ తగిలినట్లుగా తెలుస్తోంది. జిపిఎస్ అమ్మలకు సైతం నాడు విధివిధానాలను రూపొందించకుండా ఏర్పడిన కొత్త ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా నోటిఫికేషన్ ఇవ్వడమేంటి అంటూ ఉద్యోగ సంఘాల నుంచి కూడా పలువురు ప్రశ్నిస్తూ ఉన్నారు. దీంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయంతో తమకు ఎలాంటి సంబంధం లేదు అని గత ప్రభుత్వం ఈ విషయాన్ని నిర్ణయించింది అంటూ ఎన్డీఏ సర్కార్ తెలియజేసింది. నెల రోజుల క్రితం జారీ చేసిన జిపిఎస్ అమలు జీవోకు ఇప్పుడు గెజిట్ మాత్రమే మేము విడుదల చేశామంటూ తెలుపుతోంది. ఈ విషయం పైన యుటిఎఫ్ అభ్యంతరాన్ని కూడా వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: