ప్రస్తుతం నామిటేటెడ్ పోస్టుల పర్వం దగ్గరకు వస్తున్న సమయంలో అర్హతను బట్టి చంద్రబాబు ఎవరికి ఇవ్వాలనే విషయాన్ని నిర్ణయిస్తారట.క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తల నుంచి ఆయన అభిప్రాయాలు కూడా తీసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. నిజంగా టిడిపి పార్టీ కోసం పనిచేసే నాయకులు ఎంత మంది ఉన్నారనే విషయం పైన చంద్రబాబు గాలిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే కొంతమంది నాయకులకు కొంతమందిని ప్రోత్సహించాలంటే నచ్చటం లేదట..
ఎందుకంటే పదవులు ఆశించి చాలామంది టిడిపి పార్టీలో ఉన్నారని కానీ ఉన్న పదవులు కొద్దిగానే ఉన్నాయి పైగా మిత్రపక్షాలు కూడా పదవులు కోరుకుంటూ ఉండడంతో తక్కువ సంఖ్యలో ఉన్న పదవులకు ఎక్కువమంది పోటీ రావడంతో ఇది చంద్రబాబుకు చాలా ఇబ్బందికరంగా మారేలా పరిస్థితి ఉంది. దీంతో కొంతమంది నాయకులు మైండ్ గేమ్ ని బయటికి తీస్తున్నారని చర్చ ఇప్పుడు వినిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో చంద్రబాబు ఎవరి మాట వినరని .. చంద్రబాబు ఎంపిక చేయాలనుకున్న వారినే చేస్తారని.. ఎవరిని పెద్దగా గుర్తించారని.. వ్యతిరేక ప్రచారాలను జోరుగా చేస్తున్నారట. దీనివల్ల చాలామంది నేతలు చంద్రబాబు పైన ఒత్తిడి చేస్తారని తద్వారా తమ ఆశయాన్ని నెరవేర్చుకొని పదవులు సాధించాలని కోరికతో కొంతమంది నాయకులు ఇలాంటి వ్యూహాత్మక వైపు అడుగులు వేస్తున్నారని సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఇదైతే రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది.