కిచ్చా సుదీప్..ఈ హీరో పేరు తెలియని వాళ్ళు ఉండరు.ఎందుకంటే ఈయన కన్నడ హీరో అయినప్పటికీ తెలుగు,తమిళంలో కూడా మంచి గుర్తింపు సంపాదించారు. అలాంటి సుదీప్ హీరో గానే కాకుండా విలన్ గా కూడా అదరగొట్టేస్తారు. రాజమౌళి ఈగ మూవీలో విలన్ పాత్రలో ఈయన ఎంత బాగా నటించారో చెప్పనక్కర్లేదు.అయితే అలాంటి ఈ హీరో తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నారట.. అసలు విషయంలోకి వెళ్తే..కిచ్చా సుదీప్ ప్రియా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. వీరికి ఒక పాప కూడా ఉంది. అయితే పెళ్లయిన 14  సంవత్సరాలకు ఈ జంట విడాకులు తీసుకోవాలి అనుకున్నారు.అలా విడాకులకు ఫ్యామిలీ కోర్టులో అప్లై కూడా చేసుకున్నారు.

 అయితే హీరో కాబట్టి ఈ విడాకుల విషయాన్ని బయటకి రానివ్వకుండా జాగ్రత్తపడ్డారు. కానీ ఎంత జాగ్రత్త పడ్డా కూడా ఎప్పుడో ఒకసారి బయటికి రాక తప్పదు.కాబట్టి ఓ ఇంటర్వ్యూ లో బయటపడ్డారు. ఫ్రెండ్షిప్ లో గొడవలు వస్తే కొన్ని రోజులు మాట్లాడకుండా ఉండొచ్చు.కానీ పెళ్లయ్యాక గొడవలు వస్తే మాత్రం ఇలా ఉంటుంది పరిస్థితి అని తన విడాకుల వార్తను పరోక్షంగా బయటపెట్టారు. అయితే ఆ తర్వాత ఏం అద్భుతం జరిగిందో ఏమో కానీ వీరిద్దరూ విడాకులను రద్దు చేసుకున్నారు.దానికి ప్రధాన కారణం వాళ్ల కూతురు శాన్వి..

సుదీప్, ప్రియా ఇద్దరు తమ కూతురి శాన్వి కోసం విడిపోకుండా ఉండాలి అనే నిర్ణయం తీసుకున్నారు.అలా విడాకులు రద్దు చేసుకొని మళ్లీ కలిసిపోయారు. ఇక అప్పటినుండి ఇప్పటివరకు ఈ జంట మధ్య ఒక్క గొడవ కూడా రాలేదు. కూతురి కోసం విడాకులు రద్దు చేసుకున్న ఈ జంట ఇప్పటికీ ఎంతో అన్యోన్యంగా ఉంటారు. అయితే అప్పట్లో సుదీప్హీరోయిన్ తో ఎఫై** పెట్టుకొని తన భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నారనే వార్త మీడియాలో గట్టిగా వినిపించింది. కానీ ఈ విషయంపై సుదీప్ ఎక్కడ స్పందించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: