* రాష్ట్ర విభజన జరిగి దశాబ్దం దాటినా ఇంకా కొలిక్కిరాని విభజన సమస్యలు
* ఇరు రాష్ట్ర నాయకుల మధ్య కుదరని సయోధ్య
* ప్రజల భవిష్యత్ కు భరోసా వచ్చేది ఇంకెన్నాళ్ళకో ..


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2014 జూన్ 2 న రెండు రాష్ట్రాలుగా విడిపోయింది.ప్రత్యేక రాష్ట్రము కోసం ఎంతగానో ఉద్యమించిన తెలంగాణ ప్రజలు అనుకున్నది సాధించారు.వారి పోరాటంలో ఎందరో అమరవీరులు  వారి జీవితాలను త్యాగం చేసారు .ఎన్నో ఏళ్లుగా కొట్లాది చివరికి తెలంగాణ సాధించుకున్నారు.అప్పటి కేంద్రంలో వున్న కాంగ్రెస్ విభజన చట్టం సరిగ్గా చేయనందున ఇప్పటికి ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు తలెత్తుతున్నాయి.నవ్యాంధ్ర ప్రదేశ్ మొదటి ముఖ్య మంత్రిగా చంద్రబాబు ,తెలంగాణ మొదటి ముఖ్యమంత్రిగా కెసిఆర్ భాద్యతలు స్వీకరించారు.వీరి హయాంలో ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యల మధ్య ఎన్నో చర్చలు జరిగాయి.అయితే ఎవరూ కూడా స్పష్టమైన హామీలు ఇవ్వలేకపోయారు.ఇరు రాష్ట్రాల మధ్య ఎన్నో సమస్యలు వున్నాయి.ఇటు సంపద సృష్టించే రాజధాని లేక ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు అవుతుంది.


తెలంగాణ లో కూడా ఎన్నో సమస్యలు వున్నాయి..అధికారంలోకి రావడమే ధ్యేయంగా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఉచిత హామీలు ఇస్తూ తాహతు మించి అప్పులు చేసుకుంటూ వస్తున్నాయి.ఐదేళ్ల కొకసారి ఇరు రాష్ట్రాల ముఖ్య మంత్రులు మారుతున్నారు గాని కీలక సమస్యలు మాత్రం పరిస్కారం కావడం లేదు.తాజాగా తెలంగాణ ముఖ్య మంత్రిగా రేవంత్ రెడ్డి ,ఆంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా చంద్రబాబు నాయుడు భాద్యతలు చేపట్టారు.అలాగే ఇరు రాష్ట్ర సమస్యలపై ఇటీవల చర్చించారు.ఒకప్పుడు గురు శిష్యులుగా పేరున్న వీరిద్దరూ రెండ్ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కావడంతో రాష్ట్ర సమస్యలు తీరతాయని అంత భావించారు.కానీ యిరు నాయకుల చర్చలు సఫలం అయ్యేలా కనిపించలేదు.దీనితో విభజన సమస్యలు ఎప్పుడు తీరుతాయా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు.ఇరు రాష్ట్రాల భవిష్యత్ కోసం ఇద్దరు తగ్గితేనే ఒక సయోధ్యకు వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: