గడిచిన కొద్ది రోజుల నుంచి తల్లికి వందనం పథకం పైన ఆంధ్రప్రదేశ్ లో పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్షాల నుంచి విమర్శలు కాకుండా ప్రజల నుంచి కూడా అసహనం కూడా వినిపిస్తోంది. అయితే తాజాగా ఈ విషయం పైన ఏపీ ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తల్లికి వందనం పథకంలో ఎలాంటి కోతలు లేకుండా ఈ పథకాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేసి చూపిస్తోంది అంటూ కూడా తెలియజేశారు. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించి ప్రతి విద్యార్థికి కూడా 15,000 మేరకు తల్లికి వందనం పేరిట ఇచ్చే పథకాన్ని కూడా ప్రకటించబోతున్నాము అంటూ తెలిపారు


పండుగ వాతావరణంలా తల్లికి వందనం కార్యక్రమాన్ని చేపడతామంటూ తెలియజేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. అయితే అబద్దాలకు అసత్యాలకు రాష్ట్రంలో పాటు అంతర్జాతీయ స్థాయిలో కూడా వైసీపీ పేటీఎం బ్యాచ్ ఉందంటూ తెలియజేశారు. 2019లో వచ్చిన మూడు అంకెల సీట్లు 2024లో డబ్బులు డిజిటల్ కు పడిపోయిన కూడా వైసీపీ పార్టీకి బుద్ధి రాలేదు అంటూ ఫైర్ అయ్యారు.. ప్రభుత్వం ఏర్పడి నెల రోజులు కాకుండానే పింఛన్ ఇసుక తల్లికి వందనం వంటి పథకాల పైన విష ప్రచారం చేస్తున్నారంటూ ఎద్దేవ చేశారు.


ఈసారి వైసిపి పార్టీకి వచ్చేది సింగిల్ డిజిటే అంటూ కూడా తెలియజేశారు.. అమ్మ ఒడి ఇద్దరు పిల్లలున్న ఇస్తామని హామీ ఇచ్చి మాట తప్పారని మేమింకా తల్లికి వందనం విధివిధానాలు రూపొందించక ముందే వైసిపి నేతలు అసత్యాలు మొదలుపెట్టారు అంటూ తెలిపారు. అమ్మఒడిని మోసం తో కేవలం నాలుగు సార్లు మాత్రమే ఇచ్చి ప్రతి ఏటా ఇస్తామని కూడా తెలిపారని మంత్రి నిమ్మలనాయుడు తెలిపారు.. అమ్మ ఒడి పథకానికి తూట్లు పొడిచిన వైసిపి నేతలకు తల్లివందనం గురించి మాట్లాడే అర్హత లేదంటూ కూడా మంత్రి నిమ్మలనాయుడు తెలియజేయడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: