అగ్రరాజ్యం అమెరికాలో... దారుణం చోటుచేసుకుంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై... కాల్పులు జరిగాయి. కొందరు దుండగులు... ఒక్కసారిగా అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పైన.. కాల్పులకు తెగబడడం జరిగింది. ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారిపోయింది. అమెరికా ఎన్నికల ప్రచారంలో భాగంగా... తాజాగా పెన్సిల్వేనియా  లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.


ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్నారు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. అయితే ఈ ర్యాలీ అనంతరం ఓ వేదిక పైన అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతుండగానే కొంతమంది దుండగులు కాల్పులు చేశారు. దీంతో ఓ బుల్లెట్ డోనాల్డ్ ట్రంప్ కుడిచెవికితాకడం జరిగింది. దీంతో ట్రంప్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు ఆయన సిబ్బంది.


అంతేకాకుండా...  కాల్పులు జరిపిన దుండగుల్లో ఒకరిని... అక్కడే ఆయన సిబ్బంది.. కాల్చి పారేశారు. మరొక వ్యక్తి తప్పించుకున్నట్లు సమాచారం. డోనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం... ప్రస్తుతం బాగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పై..  కాల్పులు జరగడంతో ఒక్కసారిగా అమెరికా ఉలిక్కిపడింది.. ఇక ఈ ఘటనపై... కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.


అయితే... ఈ ట్రంప్.. ఘటనపై అమెరికా అధ్యక్షుడు బైడెన్ హస్తం ఉందని... ఆరోపణలు వస్తున్నాయి. అయితే.. ఎన్నికల్లో సానుభూతి కోసం... ట్రంపే ఇలాంటి సంఘటనలకు ప్రేరేపించి ఉంటారని చెబుతున్నారు కొంత మంది. ఇక అటు ఈ సంఘటనపై బైడెన్ తీవ్రంగా స్పందించారు. కాల్పుల ఘటనపై భద్రత ఏజెన్సీ ల నుంచి వివరాలు అడిగి తెలుసుకుని.. వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటు.. ఈ సంఘటనపై కమలాహారీస్ కూడా స్పందించారు. అమెరికాలో హింసకు తావు లేదని... ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు. ఇక ఈ సంఘటన పైన ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: