జిపిఎస్ ని బలవంతంగా రుద్దేందుకు ఈ ప్రభుత్వం తాతలాడుతున్నట్లుగా కనిపిస్తోందని ఉద్యోగుల్లో ఉపాధ్యాయుల లో ఈ విషయం చాలా స్పష్టంగా కనిపిస్తోందట. సిపిఎస్ ని రద్దు చేసి ఓపిఎస్ ను అమలు చేయాలని దశాబ్ద కాలంగా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఇతర ఉద్యోగ సంఘాలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు పాలకులు మాత్రం వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు.. సిపిఎస్ రద్దు దృష్టిపెట్టే వారే కరువయ్యారనే విధంగా ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. జనసేన అధ్యక్షుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సిపిఎస్ రద్దు హామీ పరిశీలించకుండానే దాఖలు చేశారా అనే విధంగా ప్రశ్నిస్తున్నారు.
దీంతో కచ్చితంగా ఉద్యోగులు ఉద్యమ బాట పట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందనే విధంగా తెలుస్తోంది. ఈ జిపిఎస్ గెజిట్ కొత్త సీసాలో పాత సారా లెక్కలాంటిల కనిపిస్తోందంటూ తెలుపుతున్నారు. కొన్ని దశాబ్దాలుగా ఉద్యోగులు మోసపోతూనే ఉన్నామని తెలియజే స్తున్నారు. ఇక నైనా సిపిఎస్, జిపిఎస్ విధానాలకు ముకుమ్మడిగా ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించే అవకాశం ఎక్కువగా ఉందని దీనివల్ల ఉద్యమాలు కూడా నిర్వహించేలా చూస్తున్నట్లు తెలుస్తోంది.. ఎలాంటి హడా విడి లేకుండా సిపిఎస్ జారిచేసిన ఏపీ ప్రభుత్వం పైన ఉద్యోగులు కాస్త ఫైర్ అవుతున్నారు. మరి ఈ జిపిఎస్ విధానాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందా లేదా చూడాలి.