ఏపీ తెలంగాణ ముఖ్యమంత్రులు ఇరు రాష్ట్రాల ప్రజలకు న్యాయం చేస్తారా  

• చంద్రబాబు గొంతులో తొంగి చూస్తున్న నిజాయితీ

• దిగి పోయేముందు మంచే చేసే అవకాశం

( ఏపీ, తెలంగాణ - ఇండియా హెరాల్డ్)  

 ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి తెలంగాణ రాష్ట్రంతో ఎంతో మంచి అనుబంధం ఉందని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ ను డెవలప్ చేసిన ఘనత బాబుకే దక్కుతుంది. ఆయన వల్ల చాలామందికి ఐటీ జాబ్స్ వచ్చాయి. వారందరూ బాబు అరెస్టు అయినప్పుడు హైదరాబాద్ రోడ్లమీదకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఇప్పటికీ బాబు అంటే తెలంగాణ ప్రజల్లో చాలా ప్రేమ ఉందని దానితో ప్రూవ్ అయ్యింది. ఏపీకి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ట్రస్ట్‌భవన్‌కు చంద్రబాబు వచ్చారు. ఆ సమయంలో కూడా తెలంగాణ ప్రజల నుంచి ఘన స్వాగతం లభించింది.

తన హయాంలోనే ఔటర్‌ రింగురోడ్డు, ఎయిర్‌పోర్ట్స్‌ వచ్చాయని కూడా చెప్పారు. ప్రజలందరూ కూడా చంద్రబాబు తెలంగాణ రాష్ట్రానికి చేసిన మంచిని గుర్తించారు. అయితే ఇప్పుడు చంద్రబాబు రాజకీయాల చివరి దశలో ఉన్నారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఆయన ముఖ్యమంత్రిగా నిలబడపోకపోవచ్చు. కుమారుడిని ఆ స్థానం కోసం బరిలోకి దింపవచ్చు. అయితే తాను అధికారంలో ఉన్నప్పుడే అన్ని విభజన సమస్యలు తీర్చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలు ఇచ్చిన చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ రెండు రాష్ట్రాల ప్రజలకు మేలు చేయాలని భావిస్తున్నట్లుగా అర్థమవుతోంది. ఎందుకంటే ఇటీవల ఆయన ఈ సమస్యలపై మాట్లాడాల్సిందిగా స్వయంగా రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.

తెలుగుజాతి ఉన్నంతవరకు తెలుగుదేశం జెండా తెలంగాణలో రెపరెపలాడుతుందని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఏపీ రెండూ తన కళ్లలాంటివని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

రెండు ప్రాంతాల ప్రయోజనాలే లక్ష్యంగా తాను పనిచేస్తానని స్పష్టం చేశారు. తెలుగుజాతి అభివృద్ధి కోసం తన చివరి రక్తం బొట్టు వరకూ వర్క్ చేస్తానని చాలా నిజాయితీగా చెప్పారు. తనను జైల్లో పెట్టినప్పుడు హైదరాబాద్‌లోని టీడీపీ కార్యకర్తలు చూపించిన మద్దతును తాను జన్మలో మర్చిపోలేనని కూడా అన్నారు. చివరగా ‘జై తెలంగాణ’ అని అంటూ చంద్రబాబు నినాదం చేశారు. ఈ ఒక్క మాటతో తెలంగాణ ప్రజలకు ఆయన మంచి చేయాలని ఆలోచిస్తున్నట్లు స్పష్టంగా అర్థం అయింది. మరి బాబు తెలంగాణకు ఎంత మేలు చేస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: