ఇటివలె వైయస్సార్ 75వ జయంతి కార్యక్రమాలను ఆ స్థాయిలో గ్రాండ్గా చేసి.. వైసీపీ పార్టీకి దీటుగా కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. ప్రజలలో కాంగ్రెస్ పార్టీని మళ్లీ తీసుకురావడానికి షర్మిల విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. వైయస్సార్ వారసుడిగా తన అన్నకు ఇచ్చిన ఒక్క అవకాశం కూడా అయిపోయింది.. రెండో అవకాశం ఇచ్చే విధంగా ఆయన పాలన సాగలేదు అంటూ షర్మిల ఎద్దేవా చేసింది. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీని ఏపీలో బలోపేతం చేయాలని.. ఈరోజు కాకపోయినా రేపు అయినా కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు వచ్చే అవకాశం ఉందని షర్మిల అనుకుంటున్నది.
ఒకవేళ ఇలా జరగాలి అంటే ఆంధ్రాలో పూర్తిగా వైసిపి పార్టీ కనుమరుగై పోవాలి.. ఈ నేపథ్యంలోనే కూటమిపై పోటీ చేసి గెలవడం సంగతి ఎలా ఉన్నా ముందుగా ఏపీలో కూటమికి ప్రత్యక్షంగా ఎదుర్కొని సత్తా తమ పార్టీకే ఉందనే విధంగా షర్మిల మాట్లాడుకోవాలి ప్రజలు అనేంతల ప్లాన్ చేస్తూ ముందుకు వెళ్ళబోతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికలలో పూర్తిగా జగన్ వైఖరిని వ్యవహార శైలి వల్లే ఓడిపోయారని కూడా బలంగా నమ్మించేలా చేసింది షర్మిల. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకునేలా షర్మిల ప్లాన్ చేయబోతున్నట్లు సమాచారం.