ఏపీలో అధికారం కోల్పోయిన రోజు నుంచి మాజీ సీఎం జగన్ నిరాశానిస్పృహలకు లోనయ్యారు. సొంత పార్టీ నేతలే పార్టీ ఓడిపోవడానికి కారణాలివేనంటూ పదుల సంఖ్యలో కారణాలను చూపిస్తుండటంతో వైసీపీ పరిస్థితి దారుణంగా ఉంది. మరోవైపు ఏపీలో అత్యాచార ఘటనలు, హత్యా ఘటనలు చోటు చేసుకుంటున్నా జగన్ మాత్రం బాధితులకు అండగా నిలబడటం కానీ స్పందించడం కానీ చేయడం లేదు.
 
కూటమికి ఆరు నెలలు లేదా ఏడాది ఛాన్స్ ఇవ్వాలని వైసీపీ భావిస్తున్నా ముఖ్యమైన ఘటనల విషయంలో స్పందించకపోతే ప్రజలు జగన్ ను నమ్మడం కష్టమవుతుంది. జగన్ ఇదే విధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో జగన్ స్థానాన్ని మరో నేత ఆక్రమించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఉమ్మడి నంద్యాల జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికకు సంబంధించి చోటు చేసుకున్న ఘటన సంచలనం సృష్టించింది.
 
జగన్ బాధితులను పరామర్శించి వైసీపీ నుంచి తన వంతు అండగా నిలబడితే బాగుంటుందని కామెంట్లు వక్తమవుతున్నాయి. జగన్ విషయంలో కార్యకర్తల ఆవేదన ఇదేనని తెలుస్తోంది. జగన్ కార్యకర్తల అభిప్రాయాలకు సైతం గౌరవం ఇవ్వాల్సి ఉంది. ఏం చేయకపోయినా ఐదేళ్ల తర్వాత కూడా తమ పార్టీదే అధికారం అనే అభిప్రాయాన్ని కలిగి ఉండటం ఏ మాత్రం మంచిది కాదు.
 
భ్రమల్లో బ్రతికితే మరోసారి ప్రజల నుంచి భారీ షాక్ తగిలే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. జగన్ పై కొత్త కేసులు నమోదవుతూ ఉండటంతో ఆయనకు ప్రశాంతత కరువవుతోందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. జగన్ సమయస్పూర్తితో అడుగులు వేస్తే పరిస్థితులు మారే అవకాశాలు అయితే ఉంటాయి. జగన్ ఏ విధంగా రాబోయే రోజుల్లో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటారనే ప్రశ్నలు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. జగన్ ఇప్పటికీ జరిగిన తప్పులను తెలుసుకోలేకపోతున్నారని తప్పులు తెలుసుకుని వాటిని సరిదిద్దుకునే దిశగా అడుగులు వేస్తే మాత్రమే వైసీపీ కార్యకర్తలు అయినా ధైర్యంగా ఉంటారని మరి కొందరు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: