భారతదేశ వ్యాప్తంగా మొన్నటి వరకు మోడీ స్పష్టంగా కనిపించింది. అయితే 2024 పార్లమెంటు ఎన్నికల్లో... మోడీ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయలేని పరిస్థితి నెలకొంది. అయితే దీనంతటికీ కారణం.... ప్రభుత్వమే లోకి వచ్చినప్పటి నుంచి... ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయడం, ఈడీ లేదా సిబిఐ కేసులు పెట్టడం జరుగుతుంది. ఇలా ప్రతిపక్ష నాయకులను వేధిస్తున్నారని నేపథ్యంలో... మోడీ ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత వచ్చింది.


అయితే మోడీ లాంటి.. బడా లీడర్ ను ఒంటి చేత్తో ఎదుర్కొన్నారు  హేమంత్ సోరెన్. ముక్తి మోర్చా లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఉన్న హేమంత్... ఇప్పటికే రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి మొన్న మూడవసారి ప్రమాణ స్వీకారం కూడా చేశారు. జైలు నుంచి బయటకు వచ్చి... బల నిరూపణ పరీక్షలో నెగ్గి జార్ఖండ్ ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణస్వీకారం చేశారు.


వాస్తవానికి భూ కుంభకోణం కేసులో... హేమంత్ ను .. బిజెపి కక్ష కట్టి అరెస్టు చేయించిందని... వార్తలు వచ్చాయి. ఈడీ అధికారులు... దాడులు చేసి మరి హేమంత్ ను జనవరి 31వ తేదీన  అరెస్టు చేశారు. అయితే దాదాపు 5 నెలల పాటు... జైల్లోనే ఉన్నారు హేమంత్. ఈ తరుణంలోనే...  నేను పార్టీకి చెందిన చాంపాయి ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు తీసుకున్నారు. అంతేకాదు తన భర్త జైల్లో ఉన్నప్పుడు... హేమంత్ భార్య కల్పన... పార్టీ కోసం చాలా కష్టపడ్డారు. పార్టీని నిలబెట్టుకున్నారు. అంతేకాకుండా... మొన్న జరిగిన  గాండే ఉప ఎన్నికల్లో కూడా తన భర్త లేకున్నా విజయం సాధించారు కల్పన.


ఇలా హేమంత్ కుటుంబాన్ని బిజెపి వేధిస్తుందని...  బిజెపి పై కోపం పెంచుకున్నారు జార్ఖండ్ ఓటర్లు. అలాగే.. 400 సీట్లు బిజెపికి వస్తే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తారని... అక్కడి ప్రజలు గ్రహించారు. దీంతో బిజెపికి ఓటు వేయకుండా... హేమంత్ వైపు మొగ్గు చూపారు.  దీంతో మొన్న... 8 పార్లమెంటు స్థానాలకు పడిపోయింది. 2014, 2019లో 12 ఎంపి స్థానాలను గెలుచుకున్న బిజెపి... ఈసారి 8 కి మాత్రమే పరిమితం అయింది. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా కూడా బిజెపికి తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని చెబుతున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే దీనంతటికీ హేమంత్...ఎపిసోడ్ కారణమని... అంటున్నారు. జైలుకు వెళ్లినా కూడా బీజేపీకి ముచ్చెమటలు పట్టించాడని హేమంత్ సోరెన్‌ పై ప్రశంసలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: