• బాబు ముందు సై అంటున్న పెద్ద పెద్ద సవాళ్లు! 


• సవాళ్ళని బాబు సమర్ధవంతంగా ఎదురుకుంటారా? 


• సవాళ్ళని మరచి జగన్ పై విమర్శలు కొనసాగిస్తారా?


అమరావతి - ఇండియా హెరాల్డ్: వైసీపీ పతనమే లక్ష్యంగా చేసుకొని జగన్ తప్పులని ఎత్తి చూపుతూ జగన్ పై విమర్శలు చేస్తూ వైసీపీ నాయకులతో శపధం చేసి మరీ గెలిచాడు చంద్రబాబు నాయుడు. వైసీపీని కట్టడి చేసేందుకు బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకొని కూటమిగా ఏర్పడి జగన్ పై యుద్ధం చేసి అఖండ విజయం సాధించి ఆంధ్రప్రదేశ్ లో పోగొట్టుకున్న తన అధికారాన్ని మళ్ళీ దక్కించుకున్నాడు చంద్ర బాబు. 135 సీట్లు టీడీపీ గెలవగా, జనసేన 21 సీట్లు ఇంకా బీజేపీ 8 సీట్లు గెలిచాయి. వైసీపీ అత్యంత దారుణాతి దారుణంగా కేవలం 11 సీట్లు మాత్రమే గెలిచి ఓడిపోయింది. అయితే భారీ విజయం సాధించే జగన్ చేసిన తప్పులకు విమర్శిస్తేనే సంబరం కాదు. రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిన వైసీపీకి ప్రతి పక్షంగా ఏ పార్టీ ఉన్నా కూడా సులభంగా గెలిచేది. అక్కడ వైసీపీ ప్రజలకు మేలు చేయడంలో ఫెయిల్ అయ్యింది కాబట్టే బాబు కూటమి గెలిచింది. కానీ గెలిచినంత మాత్రాన హమ్మయ్య అనుకుంటే సరిపోదు. జగన్ ని విమర్శిస్తే సరిపోదు ఎందుకంటే బాబు ముందు ఇప్పుడు అనేక సవాళ్లు ఉన్నాయి. వాటిని ఎదురుకుంటేనే బాబుకి జనాల్లో పాజిటిటివిటీ వస్తుంది.ముందుగా రాష్ట్రానికి ఉన్న అప్పులు తీర్చాలి. 


ఇది పెద్ద సవాలు. తల్లికి వందనం పథకం బిగ్ సవాలు. అదెలాగ చేస్తారో చూడాలి. అలాగే ప్రతి మహిళకు నెలకు 1500 ఇచ్చే పథకం, ఉచిత ఆర్టీసి ప్రయాణం వంటి సవాళ్ళనేవి బాబు ముందు ఉన్నాయి.కాబట్టి వాటిని ఆ సవాళ్ళని ఎదుర్కొని ఆ పథకాలని ఎలా నెరవేరుస్తారో చూడాలి. బీజేపీ, జనసేన పార్టీలతో రాబోయే 5 ఏళ్లలో పొత్తుని సన్నిహితంగా కొనసాగించడం బాబుకి పెద్ద సవాల్. మరి దీన్ని ఎలా కొనసాగిస్తారో చూడాలి. ఉద్యోగులకు హామీలు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి.అలాగే ఎప్పటినుంచో పెండింగ్ లో ఉన్న పోలవరం ప్రాజెక్టుని ఖచ్చితంగా పూర్తి చేసి తీరాలి. రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది.నిరుద్యోగుల కోసం మంచి మంచి పరిశ్రమలు తీసుకోచ్చి నిరుద్యోగ సమస్యని అరికట్టాలి. రాష్ట్రంలో పాఠశాలలని ఖచ్చితంగా బాగా అభివృద్ధి చెయ్యాలి. విద్యార్థుల పైచదువులు ఖచ్చితంగా నాణ్యంగా ఉండేలా చూసుకోవాలి.ముఖ్యంగా రైతులకి అండగా ఉండాలి.వారి రుణ మాఫీలు రద్దు చెయ్యాలి. రాష్ట్రంలో పేద వాళ్లకి నాణ్యమైన వైద్యం అందించే విధంగా కృషి చెయ్యాలి. పేదలకు ఉచితంగా ఇల్లులు కట్టించాలి. చిన్నా చితక పథకాలు పెట్టకుండా జనాల భవిష్యత్తు బాగుండేలా మంచి మంచి పథకాలు పెట్టాలి. రాబోయే 5 ఏళ్లల్లో ఈ సవాళ్ళని బాబు అధిగమిస్తేనే మరో పదేళ్లు అధికారంలో ఉంటారు. లేదంటే ప్రజలు తీర్పుతో మళ్ళీ దారుణంగా ఓడిపోతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: