ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 1వ తేదీన గ్రామ, వార్డ్ సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్ పంపిణీ చేశారు. గ్రామ, వార్డ్ వాలంటీర్ల సహాయ సహకారాలు లేకపోయినా పథకాలు అమలు చేయడం సాధ్యమేనని ప్రూవ్ చేయాలనే ఆలోచనతో చంద్రబాబు పింఛన్ల పంపిణీ విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే పథకాల అమలు విషయంలో బాబు జగన్ ను ఫాలో అయితే బెటర్ అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
సచివాలయ ఉద్యోగుల ద్వారా పింఛన్లు పంపిణీ చేయించడం బాగానే ఉన్నా ఉద్యోగులపై భారం పెరుగుతోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వాలంటీర్లకే ఈ బాధ్యత అప్పగిస్తే నష్టమేంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరోవైపు ప్రతి నెలా మహిళలకు 1500 కాకుండా ఒకేసారి 18000 ఇస్తే బాగుంటుందని మరి కొందరు భావిస్తున్నారు. ప్రతి నెలా 1500 ఇవ్వడం ద్వారా కొత్త తలనొప్పులు వస్తాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
ప్రరి నెలా 1500 బ్యాంక్ ఖాతాలలో జమ చేస్తే బ్యాంకుల్లో రద్దీ పెరుగుతుందని వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయిస్తే వాళ్లపై పని భారం పెరుగుతుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రతి రెండు నెలలకు ఒక స్కీమ్ అమలు చేసేలా చంద్రబాబు ప్రకటన చేస్తే ప్రాధాన్యత ఆధారంగా పథకాలను సులువుగా అమలు చేసే అవకాశం అయితే ఉంటింది.
 
ఏపీకి 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని ఆర్థిక శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ అప్పులకు వడ్డీలు చెల్లిస్తూ అవసరమైనంత మాత్రమే అప్పులు చేస్తూ చంద్రబాబు పాలన సాగించాల్సి ఉంది. రాబోయే రోజుల్లో చంద్రబాబు రాష్ట్ర అర్థిక ఇబ్బందులను అధిగమించే దిశగా ఎలాంటి నిర్ణయాలతో ముందడుగులు వేస్తారో చూడాల్సి ఉంది. చంద్రబాబు నాయుడుకు కేంద్రం సపోర్ట్ ఉండటం ఎంతగానో ప్లస్ అవుతోంది. మోదీ సర్కార్ బాబుకు ఎంతమేర సహాయసహకారాలు అందిస్తుందో చూడాలి. చంద్రబాబు నెలరోజుల పాలన మాత్రం బాగుందని కామెంట్లు వ్యక్తమయ్యాయి.
 


మరింత సమాచారం తెలుసుకోండి: