కాగా ప్రస్తుతం చంద్రబాబు ముందు ఉన్న అతిపెద్ద సవాళ్లు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అన్నింటిని కూడా నెరవేర్చడం. అయితే గతంలో వైసిపి ప్రభుత్వం ఇచ్చిన పథకాల ద్వారా.. ఇక భారీగా అప్పులు తీసుకువచ్చి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారు అంటూ చంద్రబాబు విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన దానికంటే ఎక్కువ మొత్తంలోనే పథకాల ద్వారా ప్రజలకు పంచేందుకు సిద్ధమయ్యారు చంద్రబాబు. దీంతో దీనికోసం అటు ఎక్కడి నుంచి అప్పులు తీసుకువస్తారు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది.
అమ్మకు వందనం, రుణమాఫీ, ప్రతి మహిళకు నెలకు 1500, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలంటే భారీగా అప్పులు తీసుకోవాల్సిందే. అయితే గతంలో జగన్ అప్పులు తీసుకున్నాడు అంటూ విమర్శించిన చంద్రబాబు.. ఇప్పుడు మళ్లీ అప్పులు తీసుకోకుండా జనాలపై టాక్స్ ల భారం మోపకుండా ఎలా పథకాలను అమలు చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఒకే ఒక్క దారి మాత్రమే ఉంది. అది మోదీ నుండి గ్రాంట్ లను పొందడం. అంటే అప్పులుగా కాకుండా గ్రాంట్లుగా పొందుతే మళ్ళీ చెల్లించాల్సిన అవసరం ఉండదు.
ఇలా ప్రస్తుతం ఇండియా కూటమిలో కీలకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు మోదీని ఒప్పించి ఎంత మేరకు గ్రాంట్ లు తీసుకు రాగలుగుతారు అన్నది ప్రస్తుతం ఆయన ముందు ఉన్న పెద్ద సవాలు. అయితే ఒకవేళ మోడీ చంద్రబాబు డిమాండ్‌కు ఒప్పుకొని గ్రాంట్లు ఇస్తే ఇక అటు ఎన్డీఏ కూటమిలోనే మిగతా పార్టీలు కూడా ఇలాంటి గ్రాంట్లు అడిగే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో మోది ఎలా వ్యవహరిస్తారు అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారిన అంశం. చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని మొత్తం ఉపయోగించి ఇలా మోదిని ఒప్పించగలరు అని అటు టిడిపి శ్రేణులు అనుకుంటున్నారట. ఏం జరగబోతుందో చూడాలి.