ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయిన సంగతి తెలిసిందే. 175 స్థానాలకు 175 గెలుస్తామని... ఓవర్ కాన్ఫిడెన్స్ తో ఎన్నికలకు వెళ్లిన జగన్ కు ఏపీ ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. కేవలం 11 స్థానాల్లో వైసిపి విజయం సాధించగా నాలుగు ఎంపీ స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దీంతో ఏపీలో ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది జగన్మోహన్ రెడ్డి పార్టీ.

 అలాగే వైసిపి పార్టీలో ఉన్న కీలక నేతలందరూ... బిజెపిలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం... వైసిపి నేతలను టార్గెట్ చేస్తూ రకరకాల కేసులు పెడుతోంది. ఇలాంటి నేపథ్యంలో.... కొంతమంది వైసీపీ నేతలను జగన్మోహన్ రెడ్డి దూరం పెడితే... ఆ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం వస్తుందని చెబుతున్నారు. కొడాలి నాని, విడుదల రజిని, రోజా, అంబటి రాంబాబు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి నేతలను కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గుర్తించాలి.

 ఈ నేతలందరూ చంద్రబాబును బండ బూతులు తిట్టారు. ప్రెస్ మీట్ పెట్టగానే... చంద్రబాబు కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ తిడతారు ఈ నేతలు. అయితే... చంద్రబాబు... ఇలాంటి తప్పిదాలు గతంలో చేయలేదు.  జగన్మోహన్ రెడ్డి అలాగే వైసిపి నేతలను తిట్టే బుద్ధ వెంకన్న లాంటి నేతలను పక్కకు పెట్టి.. చంద్రబాబు సక్సెస్ అయ్యారు. బూతుల నేతలకు టికెట్లు ఇవ్వకుండా మంచి నేతలకు మాత్రమే ఇచ్చారు.

తద్వారా టిడిపి కూటమి 134 స్థానాలను సంపాదించుకుంది. ఇప్పుడు అధికారంలోకి కూడా వచ్చింది. అయితే భవిష్యత్తు లో కూడా జగన్మోహన్ రెడ్డి... చంద్రబాబు బాటలో నడవాలని కొంతమంది సూచనలు చేస్తున్నారు.  బూతుల నేతలను పక్కకు పెట్టి... ప్రజా సేవ చేసే... నేతలకు ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అలా అయితేనే వైసీపీ పార్టీ సక్సెస్ అవుతుందని చెబుతున్నారు. ఈ నేతలను వదులుకుంటేనే... జగన్ కు లైఫ్..  లేకపోతే రాజకీయ సన్యాసమే?


మరింత సమాచారం తెలుసుకోండి: