ఏపీ సీఎం చంద్రబాబు నియోజకవర్గ కుప్పం రాజకీయం రోజు రోజుకి వేగంగా మారుతోంది. అధికారం దూరమైన వెంటనే వైసీపీ పార్టీ అక్కడ కనిపించకుండా పోయింది వైసిపి ముఖ్య నేతలు అంతా కూడా కుప్పానికి  రావడానికి పెద్దగా ఆసక్తి చూపించలేదని తెలుస్తోంది. ముఖ్యంగా మున్సిపాలిటీని కైవసం చేసుకునేందుకు టిడిపి పార్టీ కూడా అక్కడ సిద్ధమయ్యిందనే విధంగా కనిపిస్తోంది. టిడిపిలో చేరేందుకు వైసిపి కౌన్సిలర్లు కూడా చాలా ఉత్సాహం చూపుతున్నారని ఇప్పుడు తాజా పరిస్థితులలో కుప్పంలో పొలిటికల్ సీన్ రివర్స్ అయ్యిందనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి.


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 1989 నుంచి తిరుగులేని నాయకుడిగా కుప్పంలో ఉన్నారు. అయితే 2019 సార్వత్రిక ఎన్నికలలో చంద్రబాబు గెలిచిన ఆ ఎన్నికలలో వైసీపీ పార్టీ కుప్పంలో పట్టు కోసం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో చంద్రబాబు రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హవా ఐదేళ్లు బాగా కొనసాగింది. అంతేకాకుండా 2019 ఎన్నికలలో చంద్రబాబు మెజారిటీకి సైతం గండి కొట్టారు. కానీ గెలవలేకపోయారు. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థ ఎన్నికలలో వైసిపి పట్టు సాధించి ఏకంగా కుప్పం మున్సిపాలిటీ తో పాటు మండలాల పైన మంచిపట్టు నిలుపుకున్నది..


ఇదే దూకుడు 2024 సార్వత్రిక ఎన్నికలలో చూపించాలని చూసిన వైసీపీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. దీంతో చంద్రబాబు ఏకంగా లక్ష ఓట్ల మెజారిటీతో గెలిచారు. టిడిపి క్యాడర్ కుప్పంలో వరుసగా చంద్రబాబు ఎనిమిది సార్లు విజయాన్ని అందుకున్నారు. అంతేకాకుండా నాలుగోసారి సీఎం గా కూడా సాధించారు. దీంతో ఒక్కసారిగా కుప్పంలో పొలిటికల్ సీన్ రివర్స్ అయ్యింది. కుప్పం మున్సిపాలిటీలో ఉండే వైసీపీ కౌన్సిలర్లు సైతం గుంపుగా టిడిపిలో చేరేందుకు సిద్ధమయ్యారు. టిడిపి హై కమాండ్ ను కలిసేందుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. 25 మున్సిపాలిటీ వార్డులు ఉన్నప్పటికీ.. ఏకంగా 19 మంది వైసీపీ కౌన్సిలర్లు ఉన్నప్పటికీ కుప్పం మున్సిపల్  చైర్మన్ డాక్టర్ సుదీర్ తో పాటు ఏకంగా 11 మంది కౌన్సిలర్లు టిడిపి పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే రాబోయే రోజుల్లో అక్కడ వైసిపి పార్టీ కనిపించకుండా పోయే పరిస్థితి ఉందని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: