ఇండియాలో ఎక్స్ యూజ్ చేస్తున్న యూజర్ల సంఖ్య ఇరవై ఐదు మిలియన్లుకు కాస్త ఎక్కువ. ఇది అధికారిక సమాచారం అని తెలుస్తుంది. కానీ ఇండియాకి ఓటమి ఎరుగని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫాలోయర్లు మాత్రం ఏకంగా వంద మిలియన్లు దాటిపోయారు. ఇంతటి సోషల్ మీడియా క్రేజ్ ఉన్న ఇలాంటి పొలిటికల్ లీడర్ ఇప్పటి దాకా ఒక్కరంటే ఒక్క లీడర్ కూడా లేరు. కేవలం లీడర్ కే కాదు సెలబ్రిటీకీ లేరు. హాలీవుడ్ స్టార్ టేలర్ స్విఫ్ట్ 95 మిలియన్లు దగ్గర, సింగర్ లేడీ గాగా 83 మిలియన్ల దగ్గర మాత్రమే ఉన్నారు. అమెరికా ప్రెసిడెంట్ బైడెన్ కి అయితే మోడీకి ఉన్న ఫాలోయర్లలో సగం కూడా లేరు. ఇక ప్రపంచదేశాల్లో క్రేజ్ ఉన్న క్రికెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీకి కేవలం 64 మిలియన్లు మాత్రమే ఉన్నారు. ఇండియాలో ఉన్న ఇరవై ఐదు మంది మిలియన్ల ఎక్స్ యూజర్లు ప్రధాని మోదీని ఫాలో కాకపోవచ్చు. అయితే ఓ పది మిలియన్ల మంది ఫాలో అవుతారు. కానీ మిగతా 90 మిలియన్ల మంది విదేశీయులే అనుకోవచ్చు. 


ఎంత ప్రవాసులు ఫాలో అయినా కానీ ఆ స్థాయిలో ఫాలోయర్స్ ఉండాలంటే ఖచ్చితంగా విదేశీయుల అభిమానాన్ని కూడా పొందాల్సి ఉంటుంది. మోదీ ఇప్పుడు ఆ ఫీట్ సాధించి గ్లోబల్ లీడర్ అయ్యారని అనుకోవచ్చు. అయితే మోదీ కంటే ఆకర్షణీయమైన నేతలు … చాలా మంది ఉన్నారని.. మోదీకే ఇంతా ఫాలోయింగ్ రావడం వెనుక బాట్స్ ఉన్నాయని అనే వాళ్లు కూడా ఎక్కువగా ఉన్నారు.అమెరికా దేశంలో వంద మిలియన్లకు పైగా ఎక్స్ యూజర్లు ఉన్నారు. ఆ దేశ జనాలు హాలీవుడ్ స్టార్లను ఫాలో చేస్తారు కాబట్టి సహజంగానే ఫాలోయింగ్ పెరుగుతుంది. అమెరికా తర్వాత X ను ఎక్కువగా ఉపయోగించే దేశాల్లో నెక్ట్స్ జపాన్ ఉంటుంది. అక్కడి నుంచి మన ప్రధాని మోదీకి సపోర్టు ఉండదు. చైనాలో అసలు X లేదు. అంటే దాదాపుగా ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా నరేంద్ర మోదీ .. క్రేజ్ తెచ్చుకుని ఎక్స్ లో కూడా కింగ్ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: