తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల జంపింగ్లతో అటు అనూష పరిణామాలు చోటుచేసుకుంటున్నా యి అన్న విషయం తెలిసిందే  ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసల పర్వం జోరుగా సాగుతోంది  సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటికే ఎంతోమంది ఎమ్మెల్యేలు కారు దిగి హస్తం గూటికి చేరుకున్నారు అన్న విషయం తెలిసిందే.


 ఇలా వరుసగా కారు పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా కాంగ్రెస్ గూటికి చేరుకుంటూ ఉంటే ఒక్క ఎమ్మెల్యే పరిస్థితి మాత్రం అయోమయంలో పడిపోయిందట. ఆయన ఎవరో కాదు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. అటు రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ అధికారాన్ని కోల్పోయిన అటు బిఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసిన మహిపాల్ రెడ్డి మాత్రం హ్యాట్రిక్ కొట్టారు అయితే ఇక ఇప్పుడు కారు పార్టీలో ఉన్న ఎమ్మెల్యే లు అందరూ కూడా ఇతర పార్టీలోకి వెళ్తుండగా గూడెం కూడా మరో పార్టీ వైపు ఆశగా చూస్తున్నారు. ఇలాంటి సమయంలో అటు కాంగ్రెస్ ఇటు బిజెపి పార్టీలు గూడెం ను పార్టీలో చేర్చుకునేందుకు పెద్దగా ఆసక్తిని కరపరచడం లేదట.



 గతంలోనే మహిపాల్ రెడ్డి అటు రేవంత్ రెడ్డితో భేటీ అయినప్పుడే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేర బోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. కానీ కాంగ్రెస్లో మహిపాల్ రెడ్డిని చేర్చుకునేందుకు ఇక కిందిస్థాయి క్యాడర్ ఎక్కడ అంగీకరించడం లేదట. కాంగ్రెస్ కార్యకర్తలన మహిపాల్ రెడ్డి గురి చేసిన ఇబ్బందులను తెరమిదికి తీసుకువస్తున్నారట మరోవైపు బిజెపి అటు గూడెం మహిపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకునేందుకు మొగ్గి చూపుతున్నప్పటికీ కాషాయం పార్టీలో చేరాలంటే మాత్రం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సిందే అనే కండిషన్ పెట్టిందట బిజెపి. దీంతో ఎమ్మెల్యేగా రాజీనామా చేయాలి అనే ఆలోచనలను ఉపసంహరించుకున్న గూడెం  మహిపాల్ రెడ్డి రానుజుల్లో ఏ పార్టీలో చేరబోతున్నారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: