మరికొన్ని రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఈ క్రమంలోనే ఈ పార్లమెంట్ సమావేశాల్లో వరుసగా మూడోసారి కేంద్రంలో అధికారాన్ని దక్కించుకున్న ఎన్డీఏ ప్రభుత్వానికి ఇబ్బందులు ఎదురు కాబోతున్నాయా అంటే మాత్రం ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటే రాజకీయ విశ్లేషకులు కూడా అవును అని అంటున్నారు  ఇక ఈ పార్లమెంట్ సమావేశాలలో పూర్తిస్థాయి బడ్జెట్ తో పాటు మరికొన్ని కీలక బిల్లులను కూడా ప్రవేశ పెట్టేందుకు కేంద్ర సలహాలు చేస్తుంది


 ఇలాంటి సమయంలో రాజ్యసభలో పూర్తిస్థాయి మెజారిటీ లేని ఎన్డీఏ కూటమికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది రాజ్యసభలో నలుగురు నామినేట్ సభ్యులు గత శనివారం పదవి విరమణ చేశారు   అయితే వీరి పదవి విరమణతో అధికార బిజెపి బలం 86 పడిపోగా ఎన్డీఏ కూటమి బలం 101 గా ఉంది. 245 మంది సభ్యులు ఉండే రాజ్యసభలో ప్రస్తుతం 19 ఖాళీలు ఉన్నాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 226 కు చేరింది. మెజారిటీ మార్క్ అంటే 114 రావాల్సిందే. ప్రస్తుతం ఎన్డీఏకు సంఖ్యాబలం దీనికంటే తక్కువగానే ఉంది.


 దీంతో ఇక ఈ మద్దతు ఎక్కడినుంచి కూడా కూడగట్టుకోగలుగుతుంది అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయిన అంశం అని చెప్పాలి. గతంలో వివిధ రకాల బిల్లును ప్రవేశపెట్టడం ఏకపక్షంగా ఆమోదించుకోవడం.. చేసిన ఎన్డీఏ కూటమి ఇక ఇప్పుడు మాత్రం ఇబ్బందులు పడే అవకాశం ఉంది అనేది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇక వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో బిల్లులపై ఓటింగ్ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది అని చెప్పాలి. బిజు జనతాదళ్, బారాసా వంటి తటస్థ పార్టీలు కీలకంగా మారబోతున్నాయి. అయితే బిజు జనతాదళ్ పార్టీకి 9 మంది ఎంపీలు ఉండగా ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వీరు ప్రతిపక్ష వైపు కూర్చోవడం గమనార్హం. అయితే అన్న డీఎంకే వైకాప మద్దతుతో భాజపానికి అవకాశాలు కాస్త ఎక్కువగానే ఉన్నాయ్. కానీ రాజకీయాల్లో ఎప్పుడూ ఎలాంటి అనూహ్యపరిణామాలు చేసుకుంటాయి అన్నది ఊహకందని విధంగానే  ఉంటుంది  ఏం జరగబోతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bjp