గత వారం, ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి ముంబైలో ఘనంగా జరిగింది. అనంత్ రాధిక మర్చంట్ అనే యువతని పెళ్లి చేసుకున్నాడు. వీరి పెళ్లికి తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది అతిథులు వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ 100% సక్సెస్ రేట్ సాధించడం పెళ్లిలో ప్రధాన చర్చనీయాంశంగా మారిందని స్వయంగా పవన్ కళ్యాణ్ నే వెల్లడించారు. మంగళగిరిలో జరిగిన ఓ సమావేశంలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడుతూ దీని గురించి చెప్పడం జరిగింది. భారత రాజకీయాల్లో ఎవరూ సాధించలేని ఫీట్ అని, పోటీ చేసిన అన్ని స్థానాలను జనసేన ఎలా గెలుచుకుందనే దానిపై చాలా మంది అతిథులు ఆసక్తిగా ప్రశ్నలు వేశారని ఆయన పేర్కొన్నారు. తను ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారానని చెప్పుకొచ్చారు.
పోటీ చేసిన మొత్తం 21 స్థానాల్లో గెలిచిన జనసేన దేశవ్యాప్తంగా ప్రధాన రాజకీయ సంస్థలకు కేస్ స్టడీగా మారిందని పవన్ అన్నారు. తాను గత పదివేలలో చేసిన పనితీరు వల్లే అని ఇంతటి ఘనవిజయం సాధ్యమైందని చెప్పుకొచ్చారు. ఈ పిఠాపురం ఎమ్మెల్యే, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి గత ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకున్నారు. ఆ ఒక్కటి నుంచి 21కి చేరుకోవడం ఏపీలో అధికారాన్ని స్థాపించడం మిగతా రాజకీయ పార్టీలు ఇచ్చి చాలా స్ఫూర్తిదాయకమని చెప్పుకోవచ్చు.
అసెంబ్లీలో ఎమ్మెల్యే ప్రాతినిథ్యం లేకుండా మరే ఇతర రాజకీయ పార్టీ మనుగడ సాగించదని పవన్ అంగీకరించారు, అయితే జనసేన బలమైన కం బ్యాక్ చేయడానికి ఎన్నో కష్టాలను అధిగమించింది. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ పేలవమైన పనితీరు కనబరిచిందని మాజీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీకి హాజరు కాలేదు. అయితే పవన్ ఇంతకంటే ఎక్కువ ఓటములనే చూశారు. అయినా ఆయన ఎప్పుడూ డిసప్పాయింట్ అవ్వలేదు కాన్ఫిడెన్స్ కోల్పోలేదు. జగన్ కు, పవన్ కు మధ్య ఉన్న తేడా ఇదే అని చెప్పుకోవచ్చు.
21 సీట్లు తక్కువే అని పవన్ అంగీకరించగా, 164 సీట్లలో ఎన్డీయే కూటమి విజయంలో జనసేన కీలక పాత్ర పోషించిందని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన జనసేన ఎమ్మెల్యేలు, ఎంపీలందరినీ పవన్ సన్మానించారు.