జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల్లో అందంగా కనిపించడానికి ప్రయత్నిస్తారు కానీ రాజకీయ కార్యక్రమాల్లో మాత్రం రియల్ లైఫ్ లో ఎలా ఉంటారో అలాగే కనిపించడానికి ఇష్టపడతారు. తాజాగా అంబానీ ఇంట పెళ్లి వేడుక జరగగా ఆ వేడుకలో సైతం పవన్ కళ్యాణ్ సింపుల్ గా కనిపించడం గురించి కొన్ని కథనాలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయనే సంగతి తెలిసిందే. సామాన్యుడి లుక్ లోనే పవన్ సాహో అనిపిస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి వైట్ అండ్ ఖద్దర్ లుక్ లో కనిపిస్తున్నారు. ఖద్దరు, వైట్ అండ్ వైట్ డ్రెస్ కే ఆయన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేవారని పొలిటికల్ వర్గాల్లో టాక్ ఉండటం గమనార్హం. కొన్ని సందర్భాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ బ్లాక్ అండ్ బ్లాక్ జీన్స్, షర్ట్ వేసుకోగా మరికొన్ని సందర్భాల్లో బ్లూ జీన్స్, బ్లూ షర్ట్ ధరించారు. పవన్ కళ్యాణ్ గతంలో ప్రెస్ మీట్స్ కు నార్మల్ వైట్ షర్ట్ తో బ్లూ జీన్స్ వేసుకొచ్చారు.
 
కొన్నిసార్లు రాజకీయాల్లో సైతం పవన్ కళ్యాణ్ తన డ్రెస్సింగ్ స్టైల్ తో ట్రెండ్ సెట్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ ఏ లుక్ లో కనిపించినా అందంగానే కనిపిస్తారని ఆయన అభిమానులు భావిస్తారు. పవన్ లుక్స్ తోనే ఫిదా చేస్తున్నారని అభిమానులు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. పవన్ ఆగష్టు నెలాఖరు నుంచి షూటింగ్ లో పాల్గొననున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
 
వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలియాల్సి ఉంది. పొలిటికల్ గా నిర్దేశించుకున్న భారీ లక్ష్యాలను సాధించిన పవన్ కళ్యాణ్ కూటమి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటుందని పక్కాగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ మాట ఇస్తే తప్పరని అభిమానులు సైతం భావిస్తారు. ప్రస్తుతం పవన్ కు ఏపీ ప్రజల మద్దతు పూర్తిస్థాయిలో ఉంది. రాజకీయాల్లో పవన్ గేమ్ ఛేంజర్, ట్రెండ్ సెట్టర్ అని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: