ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్ర అభివృద్ధి కోసం కీలక నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు దాదాపుగా ఒకే డ్రెస్సింగ్ స్టైల్ ను ఫాలో అవుతున్నారనే చెప్పాలి. పూజల సమయంలో, పండుగ రోజులలో మాత్రం చంద్రబాబు నాయుడు పంచెకట్టులో కనిపిస్తారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
చంద్రబాబు నాయుడు డ్రెస్సింగ్ స్టైల్ ను ఫాలో అయ్యే అభిమానులు సైతం ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. గతంలో జగన్ పై వ్యతిరేకతను ప్రదర్శించాల్సిన సమయంలో మాత్రం చంద్రబాబు నాయుడు బ్లాక్ డ్రెస్ లో కనిపించడం ద్వారా వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత చంద్రబాబు నాయుడు షూ స్టైల్ మాత్రం మార్చారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
గతంలో మిడ్ టాప్ స్లిప్ ఆన్ లోఫర్స్ తరహా షూస్ వాడటానికి ప్రాధాన్యత ఇచ్చిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు మాత్రం ఆక్స్ ఫర్డ్ షూస్ వితౌట్ లేస్ వాడుతున్నారని తెలుస్తోంది. వైద్యులు లేదా సన్నిహితుల సూచనల మేరకు చంద్రబాబు నాయుడు షూ స్టైల్ మార్చారని కామెంట్లు వినిపిస్తున్నాయి. హెయిర్ స్టైల్ విషయంలో సైతం చంద్రబాబు ఏమీ మారలేదని చెప్పవచ్చు. చంద్రబాబు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సమయంలో ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
చంద్రబాబు నాయుడు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ప్రజల మనస్సులను గెలుచుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు 4,000 రూపాయల పింఛన్ అందిస్తుండటంతో ఏపీలోని అవ్వాతాతలు చంద్రబాబు నాయుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఆగష్టు 15వ తేదీ నుంచి చంద్రబాబు మరిన్ని పథకాల అమలు దిశగా అడుగులు వేయనున్నారని సమాచారం అందుతోంది. చంద్రబాబు సంక్షేమం, అభివృద్ధిని బ్యాలెన్స్ చేయడంపై ప్రజల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: