మాజీ మంత్రి కేటీఆర్ గురించి కొత్తగా, ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కేటీఆర్ వాగ్ధాటికి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. క్లాస్ లుక్ అయినా మాస్ లుక్ అయినా కేటీఆర్ కు తిరుగులేదని చాలామంది భావిస్తున్నారు. ఎంతోమంది యూత్ కేటీఆర్ డ్రెస్సింగ్ స్టైల్ ను ఫాలో అవుతారని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అయితే అక్కర్లేదు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కేటీఆర్ డ్రెస్సింగ్ స్టైల్ మాత్రం పెద్దగా ఏమీ మారలేదని చెప్పవచ్చు.
 
ఒక సందర్భంలో కేటీఆర్ 20 సంవత్సరాల క్రితం దిగిన ఫోటోను పంచుకోగా అప్పట్లోనే కేటీఆర్ డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ అంటూ నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తం కావడం జరిగింది. కేటీఆర్ అభిమానులు మాత్రం ఆయన ఒక బ్రాండ్ అని భావిస్తారు. ప్రస్తుతం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ సామాన్యులతో మమేకం కావడానికి వాళ్ల సమస్యలు తెలుసుకొని వేగంగా పరిష్కరించడానికి ప్రాధాన్యత ఇస్తారు.
 
విమర్శలకు పదునైనా డైలాగ్ లతో ఘాటుగా జవాబివ్వడం కేటీఆర్ కు మాత్రమే సాధ్యమని చాలామంది భావిస్తారు. పరిస్థితులకు, ప్రదేశాలకు అనుగుణంగా డ్రెస్సింగ్ స్టైల్ ను మార్చే నేతగా కేటీఆర్ కు పేరుంది. కేటీఆర్ అంచలంచెలుగా ఎదిగి ఎంతోమందికి స్పూర్తిగా నిలవడం గమనార్హం. కేటీఆర్ రాజకీయాలలో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ ను సొంతం చేసుకున్నారు.
 
భవిష్యత్తులో కేటీఆర్ కచ్చితంగా సీఎం కావాలని అభిమానుల ఆకాంక్షలను నెరవేర్చాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి రాబోయే రోజుల్లో పూర్వ వైభవం రావడం పక్కా అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ కష్టానికి తగ్గ ఫలితం దక్కాలని సామాన్యుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పుంజుకోవడానికి కేటీఆర్ ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్తారో చూడాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరవాలేదనే స్థాయిలో ఫలితాలను సొంతం చేసుకున్న బీఆర్ఎస్ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటలేదు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: