అటు డిప్యూటీ ముఖ్యమంత్రిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాధ్యతలు తీసుకొనితన మార్కు పాలన చూపిస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే ఏపీలో ఉన్న నామినేటెడ్ అలాగే... టీటీడీ చైర్మన్ పదవి పై తీవ్ర ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా టీటీడీ చైర్మన్ ఎవరు అవుతారని దానిపై ప్రభుత్వం ఏర్పాటు నుంచి చర్చ జరుగుతూనే ఉంది. మొదటగా నాగబాబు పేరు పరిశీలించినట్లు వార్తలు వచ్చాయి. అయితే దానిని స్వయంగా నాగబాబు కొట్టి వేశారు.
ఆ తర్వాత రఘురామకృష్ణరాజు, అశోక్ గజపతిరాజు పేర్లు కూడా చెరపైకి వచ్చాయి. అటు సినీ ప్రముఖులు రాఘవేంద్రరావు మరియు అశ్విని దత్ పేర్లు కూడా వినిపించాయి. అయితే తాజా సమాచారం ప్రకారం... టాలీవుడ్ సీనియర్ నటుడు, రాజకీయ నాయకులు మురళీమోహన్ పేరు ఇప్పుడు తెర పైకి వచ్చింది.
మురళీమోహన్ కు టీటీడీ చైర్మన్ పదవి ఇస్తారని ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారం రోజుల్లో మురళీమోహన్ కు ఈ పదవి.. ఇవ్వబోతున్నారట. ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మురళీమోహన్ కు పేరు ఉంది. అలాగే తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితుడుగా కూడా మురళీమోహన్ ఉన్నారు. అందుకే ఆయనకు చైర్మన్ పదవి వస్తుందని అంటున్నారు. మరి దీనిపై... నిజంగానే చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారా...? మురళీమోహన్ కు ఆ పదవి రానుందా ? సమయానికి మరో వ్యక్తిని తెరపైకి తీసుకువస్తారా..? అనే దానిపై త్వరలోనే క్లారిటీ రానుంది. అప్పటివరకు ఇలాంటి వార్తలు రావడం చాలా సహజం.