తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు పర్యాయాలు కేసీఆర్ సీఎంగా పాలించారు. ఆ తర్వాత మూడవసారి కూడా సీఎం అవుతానని భావించారు కానీ అనూహ్యంగా ప్రజలు ఆయనను ఓడించి  కాంగ్రెస్ కు పార్టీకి పట్టం కట్టారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే పూర్తిగా బీఆర్ఎస్ బలం తగ్గుతూ వస్తోంది. మొత్తం 38 మంది గెలిచినటువంటి ఎమ్మెల్యేలలో ఇప్పటికే చాలామంది బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఇదే తరుణంలో మరికొంతమంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీనియర్ నాయకులు అంతా కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమైపోయారట. ఈ విధంగా మూడింట రెండు వంతుల మంది వెళ్లిపోతే  ఏకంగా సభాపక్షమే రద్దయ్యే అవకాశం ఉంది. 

కొంత మందిలో 25 మంది చేజారితే ఇక గులాబీ పార్టీ శాసనసభ మండలి లోను గడ్డు పరిస్థితులను ఎదుర్కోవాల్సిందే.  ఇప్పటికే ఇందులో 40కి గాను బీఆర్ఎస్ 29 మంది ఉంటే, 8 మంది కాంగ్రెస్ లో చేరిపోయారు. నలుగురు నామినేటర్లను మినహాయిస్తే మిగతా 25 మందిలో 17 మంది మారితే  ఇక మండలి పక్షం సముద్రంలో ఎదురీత ఈదాల్సిందే. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీ కూడా వీళ్ళందరికీ గ్యాలం వేసి పార్టీలోకి లాగేందుకు అనేక ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ వారిని బయటకు వెళ్లకుండా ఆపే ప్రయత్నాలు ఎన్నో చేస్తోంది. అయినా ఒక్కరు కూడా ఆగే పరిస్థితి అయితే కనిపించడం లేదు. గతంలో అధికారంలో ఉండి మంత్రులుగా చేసిన ఈ నాయకులంతా ప్రస్తుతం బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైపోయారు.

దీనికి ప్రధాన కారణం భవిష్యత్తులో కూడా ఇక బీఆర్ఎస్ బతికి బయటపడే అవకాశం అయితే కనిపించకపోవడంతో వీరంతా పార్టీని వీడుతున్నారట.  ఇదే తరుణంలో గడ్డు పరిస్థితుల్లోకి వెళ్లిపోతున్న బీఆర్ఎస్ పార్టీని బిజెపిలో విలీనం చేయాలని ఆలోచనతో ఉన్నట్టు తెలుస్తోంది.  అలాంటి ఈ తరుణంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ఒకప్పటి మాజీ మంత్రులైన మల్లారెడ్డి, పద్మారావు, సబితా ఇంద్రారెడ్డితో స్పాటుగా రాజశేఖర్ రెడ్డి, సహా మరో కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అనేక మంతానాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.  ఇదంతా సక్సెస్ అయితే మాత్రం కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయం అనే విషయం అర్థం చేసుకోవచ్చు.  మరి చూడాలి ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: