2024 ఎన్నికలలో వైసిపి పార్టీ చాలా ఘోరంగా ఓడిపోయింది.. 151సీట్లు వచ్చిన వైసీపీ పార్టీకి ఈసారి కేవలం 11 సీట్లు రావడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ పార్టీ పని అయిపోయింది ఇక అంతే అంటూ కూడా దారుణంగా కామెంట్ చేశారు. కేవలం కేంద్రంలో రెండు రాజ్యసభ సీట్లను మాత్రమే వైసిపి దక్కించుకుంది. అయితే ఇప్పుడు ఏపీ కోట మొత్తం మీద 11 మంది ఎంపీలు వైసిపి పార్టీకి చెందిన వారే ఉన్నారు. వీరి అవసరం కేంద్రంలో బిజెపి పార్టీకి ఇప్పుడు చాలా ఎక్కువగా ఉన్నది.


అయితే చాలామంది వైసిపి పార్టీని 11 సీట్లే అంటూ ట్రోల్ చేసినప్పటికీ.. ఇప్పుడు ఆ నెంబరే లక్కీ నెంబర్ గా మారిపోయింది.. ఒక్క మాటలో చెప్పాలి అంటే వైసిపి పార్టీ ఎంపీల మద్దతు లేకపోతే బిజెపి ఒక బిల్లును కూడా పెద్దల సంఖ్యలో పాస్ చేయలేని పరిస్థితి ఇప్పుడు ఉన్నదట.. అంతేకాకుండా బిజెపి పార్టీ పెద్దల సభలో కూడా ఒకసారిగా సంఖ్య 86 కి పడిపోయింది.. ఇండియా మిత్రులు అందరూ కలిపిస్తే 101 సీట్లు సంఖ్య బలంగా ఉన్నది.. రాజ్యసభ బిల్లు ఆమోదం కావాలి అంటే 213 సీట్లు ఉండాల్సి ఉన్నది..


101 సీట్లకు వైసీపీకి ఉన్న 11మంది అలాగే అన్న డిఎంకెకి ఉన్న నలుగురు కలిపితే బీజేపీ పెద్దల సభలో బిల్లులను గట్టెక్కించే పరిస్థితులను ఏర్పడతాయి. అలాగే బిజెపికి చెందిన నామినేటెడ్ ఎంపీలు సైతం నలుగురు రిటైర్ అయ్యారు. బిజెపి కంటే ఆ తర్వాత ప్లేస్ లో కాంగ్రెస్ 26 మంది ఎంపీలతో బలంతో ఉన్నది.. ఆ తర్వాత మూడవ ప్లేసులో తృణమాల్ కాంగ్రెస్ పార్టీ ఉన్నది.. నాలుగవ ప్లేస్ లో వైసీపీ పార్టీ ఉన్నది... ఏది ఏమైనా వైసీపీ ఎంపీల మద్దతు కోసం బిజెపి నేతలు వైసిపి పార్టీ మీద ఆధారపడాల్సి వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: