తెలంగాణ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీనే తనకి తలనొప్పిగా మారింది అనుకుంటే, ఇక‌ కేంద్రంలోని మోడీ వైపు నుంచి కూడా ఇబ్బందులు ఎదురు అవుతున్నట్టు గుసగుసలు వినబడుతున్నాయి. 2023, న‌వంబ‌రులో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్ చిత్తు చిత్తుగా ఓడిపోయిందన్న సంగతి అందరికీ తెలిసినదే. తిరిగి అధికారంలోకి వ‌స్తామ‌ని చెప్పిన కేసీఆర్.. ఆ ఎన్నిక‌ల్లో అత్యంత దారుణమైన ప‌రాభ‌వం చవిచూశారు. ఆ త‌ర్వాత‌ కూడా.. పార్టీని గాడిలో పెట్టేలా వ్యూహాత్మ‌కంగా ముందుకు తీసుకెళ్లడంలో కేటీర్, కెసీర్ పూర్తిగా విఫలం అయ్యారు. దాంతో పార్టీలోని మిగతా నాయకులను కోల్పోయే పరిస్థితికి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఫ‌లితంగా 34 మంది ఎమ్మెల్యేల్లో ఇప్ప‌టికే 9 మంది జంప‌య్యారు.

ఇక‌, మ‌రో ప‌ది మంది వ‌ర‌కు లాగేస్తే.. ఇక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా కోల్పోయే అవకాశం ఉంది. మరోవైపు ఎమ్మెల్సీలు కూడా ఆ పార్టీలో ఉండడం లేదు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్‌కు ఏం చేయాలో తోయడం లేదు. ఏదో ఒక ర‌కంగా.. రేవంత్ రెడ్డి స‌ర్కారును ఇరుకున పెట్టాలని చూస్తే, మొదటికే మోసం వస్తోందంటూ కెసిఆర్ తన సన్నిహితుల దగ్గర వాపోతున్నాడని సమాచారం. ఇలా.. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి స‌ర్కారు నుంచి కేసీఆర్‌కు ఇబ్బందులు వ‌స్తున్నాయి. ఇప్పుడు మ‌రో వ్యూహానికి కూడా కేసీఆర్ బలవుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారును గ‌ద్దెదించుతానంటూ.. ఆయ‌న రెండేళ్ల కింద‌ట పన్నాగం వేసాడు. ఈ క్రమంలో ప‌లువురు ముఖ్య‌మంత్రుల‌ను క‌లిసి.. ప్ర‌త్యేక కూట‌మికి ఏర్పాట్లు చేస్తున్న‌ట్టు తెలిపారు.

అయితే.. ఈ క్ర‌మంలోనే మోడీ కేసీఆర్‌ను బ‌లంగా నియంత్రించే ప్రతి ప్ర‌య‌త్నాలు చేయడం సక్సెస్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో వెలుగు చూసిన లిక్క‌ర్ కుంభ‌కోణాన్ని కేసీఆర్ కు సంధించారు. దీంతో ఆయ‌న గారాల ప‌ట్టి క‌విత‌.. కటకటాల పాలైంది. దీంతో పార్ల‌మెంటు ఎన్నికల్లో ఏర్ప‌డిన చిక్కుల ఫ‌లితంగా.. కేసీఆర్ పార్టీ కోలుకోలేని విధంగా దెబ్బ‌తిని పోయింది. ఇక‌, ఇప్పుడు ఉన్న‌ది రాజ్య‌స‌భ‌పై ఆశ‌లు మాత్రమే.. ఇప్పుడు వీరిని కూడా త‌మ‌కు అనుకూలంగా మార్చుకునే ప్ర‌య‌త్నాల్లో బీజేపీ ఫుల్ బిజీ అయిపోయింది. ఇదే జ‌రిగి ప్ర‌స్తుతం బీఆర్ ఎస్‌కు ఉన్న న‌లుగురు రాజ్య‌స‌భ‌స‌భ్య‌ల్లో ఇద్ద‌రు జారుకున్నా.. ఆ పార్టీకి ఇబ్బందే. దీనిని ఎలా ఎదుర్కొంటార‌నేది చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: