తెలంగాణ రాష్ట్ర సమితి... పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. రోజుకు ఒక ఎమ్మెల్యే చొప్పున కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. ఇప్పటివరకు పదిమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. గులాబీ పార్టీ తరఫున గెలిచిన... కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ లాంటి కీలక నేతలు కూడా.. ఇప్పటికే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.


ముఖ్యంగా పటాన్ చెరువు ఎమ్మెల్యే మహిపాల్  రెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్య, లాంటి ఎమ్మెల్యేలు... కాంగ్రెస్ పార్టీలోకి జంప్ అయ్యారు. అయితే ఎమ్మెల్యేల పైన.. యాక్షన్ తీసుకోవాలని... గులాబీ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఇవాళ కేటీఆర్... తమ ఎమ్మెల్యేలను పట్టుకొని అసెంబ్లీకి వెళ్లారు.


ఎమ్మెల్యేల ఫిరాయింపు, నియోజకవర్గాలలో  గులాబీ పార్టీ ఎమ్మెల్యేలకు ప్రోటోకాల్ ఇష్యూ రావడం  లాంటి వాటి పైన... తెలంగాణ స్పీకర్ కు ఫిర్యాదు చేశారు కేటీఆర్, మరి కొంతమంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు. అయితే కేటీఆర్... ఆదేశాల మేరకు కేవలం 14 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారు. మరో 14 మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టారు. అయితే...  కేటీఆర్ పిలుపు రాని వారిలో మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా ఉన్నారు.


ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే - కొత్త ప్రభాకర్ రెడ్డి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఇలా మొత్తం 14 మంది బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే కేటీఆర్‌ పిలుపు మేరకు రాలేదు. అయితే.. రాని వారిలో కేసీఆర్‌ కూడా ఉన్నారు. అయితే.. ఈ ఎమ్మెల్యేలు కేసీఆర్‌ అనుమతి మేరకు రాలేదని సమాచారం. ఇతర కారణాల వల్లే.. హైదరాబాద్‌ లేమని ఇప్పటికే కేసీఆర్‌ కు తెలిపారట. అందుకే కేటీఆర్‌ పిలుపు మేరకు 14 మంది ఎమ్మెల్యేలు మాత్రమే వచ్చారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

KCR