గుడివాడలో కొడాలి నానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ ఆఫీసు క్లోజ్‌ అయింది. గుడివాడలో వైకాపా కార్యాలయం ఖాళీ చేయించింది యాజమాన్యం. గుడివాడలోని శరత్ ధియేటర్ కొన్నేళ్లుగా కొడాలి నాని అధ్వర్యంలో నడిచింది వైసీపీ గుడివాడ కార్యాలయం. గత ఐదేళ్లుగా అధికారాన్ని అడ్డు పెట్టుకుని శరత్ థియేటర్ ను కొడాలి నాని ఆక్రమించుకున్నారని యాజమాన్యం ఆరోపణలు చేసింది. కూటమి ప్రభుత్వం రాగానే శరత్ టాకీస్ ను స్వాధీనం చేసుకుంది యజమాన్యం.


ఈ తరుణంలోనే... శరత్ టాకీస్ యాజమాన్యంలో ఒకరైన మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు ఆహ్వానం మేరకు టీ పార్టీకి హాజరయ్యారు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఇతర టిడిపి నేతలు. థియేటర్లో వైకాపా ఫ్లెక్సీలు....కొడాలి నాని ఫోటోలను తొలగించింది థియేటర్ యజమాన్యం. ఈ సందర్భంగా గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ తమకు జరిగిన అన్యాయంపై థియేటర్ హక్కుదారులు.... నన్ను కలిశారని... గుడివాడ నడిబొడ్డులో ఇన్నాళ్లు అరాచకానికి అడ్డాగా వైకాపా కార్యాలయం నిలిచిందని ఆగ్రహించారు.


ఇక్కడకు రావాలంటే ప్రజలు భయపడే పరిస్థితి ఉండేది.... ఆఖరుకు ముగ్గురు హక్కుదారులు థియేటర్ కు వస్తే బెదిరింపులు ఎదుర్కొనే పరిస్థితి ఉందని తెలిపారు వెనిగండ్ల రాము. గుడివాడ వ్యాప్తంగా కొడాలి నాని అనుచరులు..... పేద, మధ్యతరగతి వర్గాల ఆస్తులను కబ్జా చేశారని ఆగ్రహించారు. వారందరికీ కూడా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన 24 గంటల్లోనే కొడాలి నాని కబ్జాలో ఉన్న తొమ్మిది ఎకరాల స్థలాన్ని హక్కు దారులకు అప్పగించామన్నారు.


టిడిపి ప్రజల తరపున పనిచేస్తుంది...... ప్రజల డబ్బు కోసం ఆశపడే వాళ్లెవరు టిడిపిలో లేరని వివరించారు వెనిగండ్ల రాము. గుడివాడలో ప్రజలకు జరిగిన అన్యాయలపై పోరాడుతాను.... గుడివాడలో అరాచకాలు రూపుమాపి ప్రజల ఊరుగా మారుస్తానని ప్రకటించారు వెనిగండ్ల రాము. ఇక గుడివాడలో కొడాలి నాని ఆటలు సాగనివ్వబోమని హెచ్చరించారు వెనిగండ్ల రాము.

మరింత సమాచారం తెలుసుకోండి: