• వంగలపూడి అనిత.. ఫైర్ కి బ్రాండ్ అంబాసిడర్ 

• వంగలపూడి అనిత.. ఎందరో ఆడవాళ్లకు స్ఫూర్తి 


ఆంధ్రప్రదేశ్ - ఇండియా హెరాల్డ్: టీచర్ గా కెరీర్ ప్రారంభించి, అనూహ్య మలుపులు తిప్పుకుని రాష్ట్ర హోం మంత్రి గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న వంగలపూడి అనిత ఇప్పుడు రాష్ట్రంలో పొలిటికల్ సెన్సేషన్గా మారింది. తన అభిప్రాయాలను నిక్కచ్చిగా, బలంగా భయం లేకుండా వినిపించే అనిత, ఇప్పుడు రాజకీయంగా కూడా బలంగా అడుగులు వేస్తున్నారు. ఆధిపత్య ధోరణి అన్న పదానికి తావివ్వకుండానే ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలను నియంత్రించే పాఠాలను వల్లె వేస్తున్నట్టు ఆమె తీరు కనిపిస్తోంది. తాను డామినేట్ చేస్తున్నట్టు బయటకు కనిపించనీయ్యకుండానే, తనకు వచ్చిన అవకాశాన్ని బాగా వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు అనిత.ఉమ్మడి విశాఖ జిల్లాలనుంచి పలువురు అతిరథ మహారథులు భారీ మెజారిటీలతో గెలిచినా కానీ మంత్రి పదవిని దక్కించుకోవడంలో అనిత విజయం సాధించారనే చెప్పాలి. జిల్లాలో సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు స్పీకర్ కాగా, మంత్రి పదవిని బలంగా ఆశించిన మాజీ మంత్రులు గంటా, బండారు ఇంకా నాలుగు సార్లు ఎమ్మెల్యేలు అయిన వెలగపూడి, గణబాబు, జనసేన నుంచి కొణతాల, పంచకర్ల రమేష్, బీజేపీ నుంచి విష్ణు కుమార్ రాజు లాంటి పలువురు స్ట్రాంగ్ నేతలు బలంగా మంత్రి పదవులు ఆశించారు. అయితే రెండోసారి ఎమ్మెల్యే ఆయిన అనిత వైపే టీడీపీ అధిష్టానం మొగ్గు చూపి, ఆమెకు మంత్రి పదవి ఇచ్చింది. 


అది కూడా మామూలు పోర్ట్ ఫోలియో కాదు అత్యంత శక్తివంతమైన హోం మంత్రి.అలా పదవి దక్కించుకున్న తరువాత ఉమ్మడి జిల్లాల్లో అందరి ఎమ్మెల్యేల ఇళ్లకు తానే స్వయంగా వెళ్లి, నేను హోం మంత్రిని అయినా పార్టీ విధేయురాలిగానే ఉంటానంటూ, అందరి ఆశీస్సులు తీసుకొని అచ్చమైన తెలుగింటి ఆడపడుచు అనిపించుకున్నారు. వాళ్లకు మంత్రి పదవి రాలేదన్న బాధ నుంచి బయట పడేసే గొప్ప ప్రయత్నం చేశారు అనిత. తనకు పదవి వచ్చిందని పొంగి పోవడం లేదంటూ, అందరం కలిసి మెలసి పని చేద్దాం అన్న సంకేతాలతో అందరి ఇళ్లకు స్వయంగా వెళ్ళి జనాల్లో పాజిటివిటీ పెంచుకున్నారు. అలా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించిన అనిత, అదే సమయంలో హోంమంత్రి గా తనకు దక్కే ప్రివిలేజెస్ విషయంలో కానీ, ఆ స్థాయీ నాయకత్వాన్ని ప్రదర్శించడంలో కానీ ఎక్కడా తడబడడం లేదన్న ప్రశంసలను పొందుతున్నారు. నాయకత్వం విషయంలో ఎవరి జోక్యాన్ని లేకుండా తనదైన శైలీ రాజకీయాన్ని చేస్తున్నారు. ప్రస్తుతం అనిత ముందుకు వెళ్తోన్న తీరు అందరి మన్నలు పొందుతోంది. అనిత నిత్యం నిండైన చేరతో కట్టు బొట్టుతో తెలుగింటి ఆడపడుచులా లక్షణంగా ఉంటుంది. దళిత కులానికి చెందిన అనిత ఎందరో వెనక బడ్డ కులాల వారికి ఆదర్శంగా నిలిచే స్త్రీగా రాజకీయాల్లో తన ముద్ర వేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: