తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో ఎంతో మంది మహిళా రాజకీయ నేతలు ఉన్నారు. వారిలో కొంత మంది తమ అద్భుతమైన వాక్చాతుర్యంతో, పరిపాలనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇకపోతే మహిళలు ఎంత సాంప్రదాయ బద్దంగా ఉంటే అంత మంచి గుర్తింపు, గౌరవం సమాజంలో దక్కుతూ ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు అంటే వారు పది మంది కి ఆదర్శ ప్రాయంగా నిలబడాల్సిన వ్యక్తులు. అలాంటి వారు తమ కట్టు బొట్టు తో కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవాల్సి ఉంటుంది.

వారిని చూసి పది మంది ఆ పద్ధతి ఫాలో అవ్వాలి అనుకునేలా ఉండాలి. అలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళ రాజకీయ నేతలలో తన కట్టు , బొట్టుతో ఎంతో మంది హృదయాలకు దగ్గర అయిన నేతలలో విడుదల రజినీ ఒకరు. ఈమె తెలుగు దేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చింది. ఆ తర్వాత వైసిపి పార్టీలోకి వెళ్ళింది. ఇక వైసిపి పార్టీలో ఈమె మొదటి సారిగా ఎమ్మెల్యే గా పోటీ చేసి మొదటి ప్రయత్నం లోనే విజయం సాధించింది.

ఇక ఈమెకు ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గం లో అవకాశం కూడా దక్కింది. ఇకపోతే కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికలలో ఈమె ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయింది. ఇక ఎక్కడికి వెళ్లినా కూడా పద్ధతిగా చీర కట్టుకొని , అంతే పద్ధతిగా నడుచుకుంటూ ఉంటుంది. దానితో ఈమె డ్రెస్సింగ్ స్టైల్ కు ఎంతో మంది మహిళలు కూడా ఫిదా అవుతున్నారు. అలాగే ఆమె వేషధారణ చీర కట్టులో తెలుగు తనం ఉట్టి పడేలా ఉండడంతో ఎంతో మంది తెలుగు మహిళలు కూడా ఈమె వేషాధారణను ఫాలో కావడానికి ఇష్టపడుతున్నారు. అంతలా ఈమె తన కట్టు , బొట్టుతో తెలుగు మహిళలను ఆకట్టుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: