* రాజన్న బిడ్డగా దూసుకుపోతున్న షర్మిల
 
* షర్మిల సడన్ ఎంట్రీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కీలక మార్పులు
 
* రాష్ట్రంలో వైసీపీ పతనానికి ప్రధాన కారణంగా మారిన షర్మిల

*  కాంగ్రెస్ కి మళ్ళీ పూర్వ వైభవం తెస్తుందా  ?


వైఎస్ షర్మిల ఈ పేరు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారింది.రాజన్న బిడ్డగా రాజకీయాలలో తనదైన ముద్ర వేశారు షర్మిల.ఆనందంగా సాగిపోతున్న షర్మిల జీవతంలో తండ్రి మరణం పెను విషాదాన్ని నింపింది.అయినా కూడా కొండంత ధైర్యం తెచ్చుకుని అన్న జగన్ కు రాజకీయంగా ఎంతో సపోర్ట్ గా నిలిచింది.అక్రమ కేసుల ఆరోపణలో జగన్ జైలు పాలవడంతో తన అన్న స్థాపించిన పార్టీని తన భుజ స్కందాలపై మోసింది.నిత్యం ప్రజలలో తిరుగుతూ వైసీపీ తరుపున విస్తృత ప్రచారం చేసింది.తాను జగన్ అన్న వదిలిన బాణాన్ని అంటూ షర్మిల జనంలో మరింత క్రేజ్ సంపాదించుకున్నారు.షర్మిల ప్రచారంతో వైసీపీ పార్టీకి రాష్ట్రంలో మరింత బలం చేకూరింది.జైలు నుండి విడుదలయిన జగన్ 2014  ఎన్నికలలో ఓడిపోయినా కూడా రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా మారారు.ఆ తరువాత విస్తృత పాదయాత్ర చేసి 2019 ఎన్నికలలో ఏకంగా 151  సాధించి సంచలనం సృష్టియించారు.కానీ వైసీపీ పార్టీకి ఎనలేని సేవ చేసిన షర్మిలకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది.


అన్నా చెల్లెళ్ళ మధ్య రాజకీయ వివాదం చెలరేగింది..దీనితో షర్మిల తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్  తెలంగాణ పార్టీని స్థాపించి అక్కడి అధికార పక్షం అయిన కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేసారు.తెలంగాణాలో మళ్ళీ రాజన్న రాజ్యం రావాలని పాద యాత్ర కూడా చేసారు.కానీ చివరి నిమిషంలో ఆమె పోటీ నుంచి తప్పుకున్నారు.ఎన్నికలు పూర్తి అయ్యాక తెలంగాణాలో గెలిచినా కాంగ్రెస్ లో ఆమె పార్టీని విలీనం చేసారు.దీనికి బదులుగా కాంగ్రెస్ పార్టీ ఆమెను ఆంధ్రప్రదేశ్ పీసిసి అధ్యక్షురాలిగా నియమించింది.ఆంధ్రప్రదేశ్ లో అప్పటికే రాజకీయం వాతావరణం వేడెక్కింది.షర్మిల రాకతో ఆంధ్ర రాజకీయాలలో పెను మార్పులు వచ్చాయి.అప్పటి అధికార వైసీపీ  ప్రభుత్వంపై  షర్మిల విమర్శనాస్త్రాలతో విరుచుకుపడింది.

ఒకప్పుడు ఏ పార్టీ కోసమైతే విస్తృత ప్రచారం చేసిందో  ఆపార్టీ పైనే షర్మిల యుద్ధం ప్రకటించింది.కాంగ్రెస్ తరుపున షర్మిల కడప ఎంపీ స్థానానికి పోటీ చేసారు.అయితే రాష్ట్రంలో కూటమి హవా సాగడంతో ఈ సారి వైసీపీ కేవలం 11 సీట్లు మాత్రమే సాధించి ప్రతిపక్ష హోదా కోల్పోయింది.షర్మిల కూడా  ఓటమి పాలయ్యింది.ఎప్పటి లాగే కాంగ్రెస్ ఖాతా తెరవలేదు.అయితే వైసీపీ ఓట్లను చీల్చడంలో షర్మిల సక్సెస్ అయ్యారు.ఈ ఐదేళ్ళలో కాంగ్రెస్ ను ఫేమ్ లోకి తేవాలని షర్మిల ఎంతో కృషి చేస్తుంది.ఇటు వైసీపీ కూడా మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు పావులు కదుపుతుంది.దీనితో అన్నాచెల్లి మధ్య గొడవ మిగిలిన వారికి ఎంతగానో పనికొస్తుంది.మరి రాజన్న బిడ్డగా షర్మిల ఏపిలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తుందో లేదో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: